Author: admin

తిరుపతి,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): వైద్యశాఖ మంత్రి విడదల రజినీ, తిరుపతి మేయర్‌ శిరీషా లు మహిళా ద్రోహులని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ కేసులకు భయపడేది లేదని, ఇక్కడ నుంచి ప్రసూతి వైద్యశాలను తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. ఎంత వరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ప్రసూతి ఆస్పత్రి భవనానికి తగిలించిన తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం బోర్డును సీపీఐ కార్యకర్తలు పీకి, కాల్చేశారు. ఆస్పత్రిలో పేషెంట్లు ఉన్నా బోర్డు మార్చడంపై మండిపడ్డారు. దీంతో ప్రసూతి వైద్యశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read More

విజయవాడ,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): కృష్ణా జిల్లా ఉయ్యూరు జెడ్పీటీసీ యలమంచిలి పూర్ణిమ తన పదవికి రాజీనామా చేశారు. అధికార పార్టీకి చెందిన పూర్ణిమ రాజీనామాతో వైసీపీలో కలకలం రేగింది. అధికార పార్టీ నేతల సహాయ నిరాకరణ, ఎవ్వరూ సహకరించకపొవడంపై పూర్ణిమ అసంతృప్తితో ఉన్నారు. గతంలో అనేకసార్లు చెప్పినప్పటికీ ఎవ్వరు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసిన పూర్ణిమ… మచిలీపట్నంలో కలెక్టర్‌కు రాజీనామా పత్రం సమర్పించారు.

Read More

భోపాల్‌,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): మధ్యప్రదేశ్‌ను వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు పోటెత్తడంతో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. శివపురి జిల్లాలో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగడంతో.. నివాసాల మధ్యకు మొసళ్లు చేరుకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మొసళ్లు ఇండ్ల మధ్యకు రావడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మొదట బస్టాండ్‌ వద్ద ఓ మొసలి కనిపించిందని గ్రామస్తులు తెలిపారు. ఆ తర్వాత నివాసాల మధ్యకు చేరుకుని, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ మొసళ్లను పట్టుకునేందుకు స్థానికంగా ఉన్న మాధవ్‌ నేషనల్‌ పార్క్‌ నుంచి అటవీ శాఖ అధికారులు వచ్చారు. గంటల పాటు శ్రమించి ఓ 8 అడుగుల పొడవున్న మొసలిని బంధించారు. అనంతరం సంఖ్యా సాగర్‌ లేక్‌లో వదిలేశారు.

Read More

జయపుర,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): స్వాతంత్య దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం రాజస్దాన్‌లోని బర్మార్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్‌ పంపిణీ చేయడం కలకలం రేపింది. గుడమలని ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒపియం, పప్పీ హస్క్‌ వంటి నిషేధిత డ్రగ్స్‌ సేవించారని చీఫ్‌ బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి ఓంప్రకాష్‌ విష్ణోయ్‌ వెల్లడిరచారు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారాయి. స్వాతంత్య వేడుకలు ముగిసిన అనంతరం దాదాపు పదిమందికి పైగా పాఠశాలకు చేరుకుని అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. నిందితులు డ్రగ్స్‌ సేవిస్తున్నట్టు వైరల్‌ వీడియోల్లో కనిపించింది. ఘటనపై సమాచారం అందుకున్న తర్వాత అధికారులు అక్కడికి చేరుకునే సమయానికి నిందితులు ఎవరూ లేరని విష్ణోయ్‌ తెలిపారు. విద్యార్ధులు, టీచర్ల స్టేట్‌మెంట్‌ నమోదు చేసుకుని నిందితుల ఆచూకీ పసిగడతామని చెప్పారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని విష్ణోయ్‌ వెల్లడిరచారు.

Read More

అమరావతి,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఫేస్‌ క్యాప్చరింగ్‌ అటెండెన్స్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీటీఎఫ్‌ , ఫ్యాఎª`టోఉపాధ్యాయ సంఘాలు నిరసనకు దిగాయి. ఎన్నికల హావిూ సిపిఎస్‌ రద్దు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల విలీన పక్రియ ఉపసంహరించాలని నిరసన చేపట్టారు. జీవో 117 రద్దు, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ డిమాండ్‌లతో ఉపాధ్యాయ సంఘాలు 100 రోజుల పాటు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. నేటి నుంచి వచ్చే నెల 16 వరకు వరకు 30 రోజుల పాటు విజయవాడ ధర్నా చౌక్‌లో నిరన దీక్షలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి.

Read More

తెలంగాణ హైకోర్టుకు ఇటీవల నియమితులైన న్యాయమూర్తులు ఆరుగురు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ వీరందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో ముగ్గురు ఉమ్మడి కరీనంగర్‌ జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణుగోపాల్‌, జస్టిస్‌ నగేష్‌ భీమపాక, జస్టిస్‌ పుల్లా కార్తీక్‌, జస్టిస్‌ కాజ శరత్‌, జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అభినందనలు తెలిపారు. కరీంనగర్‌ మంకమ్మతోటలో 1967 ఆగస్టు 16న జన్మించిన జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణుగోపాల్‌… 1992లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది దివంగత రామ్‌జెఠ్మలానీ వద్ద జూనియర్‌గా పనిచేశారు. రైల్వే స్టాండిరగ్‌ కౌన్సిల్‌గానూ సేవలందించారు. ఆ తర్వాత 2021లో సీనియర్‌ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. జస్టిస్‌ నగేష్‌ భీమపాక స్వస్థలం భద్రాచలం. 1993లో బార్‌…

Read More

అమరుల స్ఫూర్తితో యువత తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలను సాధించాలని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశానికి స్వాతంత్యంª`ర వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా సందర్భంగా వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు. గత ఎనిమిది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించిందని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణా రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రమణ చారి,…

Read More

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్మల్‌ పట్టణంలోని మినీ ట్యాంక్‌ బండ్‌ పై నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.అంతకుముందు ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో విద్యార్థులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. శాంతి కపోతాన్ని, త్రివర్ణపు బెలున్లను గాల్లోకి ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్‌ స్టేడియం నుంచి మినీ ట్యాంక్‌ బండ్‌ వరకు జాతీయ జెండాలు చేతబట్టుకుని.. నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ నెల 8వ తేదీ నుంచి 22 వరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వాతంత్య భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ఈ రోజు చారిత్రాత్మక సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ కె. విజయలక్ష్మిరెడ్డి, కలెక్టర్‌ ముశ్రరఫ్‌ పారూఖీ అలీ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మంగళవారం పాలకుర్తి మండలం, విస్నూర్‌ నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌ వెంకట స్వామి, మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ, స్థానిక నేతలు పాల్గొన్నారు. విస్నూర్‌, లక్ష్మీనారాయణపురం, పాలకుర్తి, కడవెండి వరకూ పాదయాత్ర సాగనుంది. మంగళవారంతో బండి సంజయ్‌ వెయ్యి కిలోవిూటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. దేవరుప్పుల దాడి ఘటనల నేపథ్యంలో పాదయాత్ర రూట్‌లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్‌ పునాదులు కదులుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొంద పెట్టేందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. పాలకుర్తి చౌరస్తాలో రోడ్‌ షో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో నిజాం పాలన సాగుతోందని ఆరోపించారు. తాను వస్తున్నాననే పోలీసులు…

Read More

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఓ అద్భుత ఘట్టమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వజ్రోత్సవాల నేపథ్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగా మంత్రి స్వయంగా తయారు చేయించిన 3 వేల అడుగుల పొడవైన జాతీయజెండాను ప్రదర్శించారు. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి కలెక్టరేట్‌ వరకు జాతీయ జెండాను ప్రదర్శించారు. జాతీయ గీతాలాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రికార్డు స్థాయిలో మూడు కిలోవిూటర్లు పొడవు జాతీయ జెండా ప్రదర్శించడం ఓ అద్భుత ఘట్టం అన్నారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన పోరాటయోధుల్ని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. స్వాతంత్య పోరాట స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు తెలియజేసేందుకే సీఎం కేసీఆర్‌ 2 వారాల పాటు భారత స్వాతంత్య వజ్రోత్సవ సంబురాలకు రూపకల్పన చేశారన్నారు.

Read More