స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పై నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.అంతకుముందు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో విద్యార్థులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. శాంతి కపోతాన్ని, త్రివర్ణపు బెలున్లను గాల్లోకి ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు జాతీయ జెండాలు చేతబట్టుకుని.. నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ నెల 8వ తేదీ నుంచి 22 వరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వాతంత్య భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ఈ రోజు చారిత్రాత్మక సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కె. విజయలక్ష్మిరెడ్డి, కలెక్టర్ ముశ్రరఫ్ పారూఖీ అలీ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!