Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!
Author: admin
1947 ఆగస్టు 15 నుండి మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు అనేక మంది సమర యోధులు, మహనీయులు మరియు ప్రజలు 1857 నుండి బ్రిటీష్ పాలనపై జరిపిన సుదీర్ఘ పోరాటాలు మరియు త్యాగాల ఫలితమే. ఆ మహోద్యమంలో అనేక పోరాటాలు మరియు త్యాగాలు చేసి అసువులు బాసిన వీరులను స్మరించుకొని, వారికి నివాళులు అర్పించి, ఏల్లవేళలా మన దేశాన్ని కాపాడుచున్న సైనికులకు మనం కృతఘ్నతలు తెలపాలని కోరుచున్నాను. ఇళ్ళపై జాతీయ పతాకాలను ఎగురవేసి, దేశ సర్వతోముఖాభివృద్ధికి, ఔన్నత్యతకు మరియు సమగ్రతకు ఎల్లప్పుడు పాటుపడతామని ప్రతినబూనుచూ నేడు స్వేత్యా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరుచూ ప్రకాశం జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను.
చిత్రం : మాచర్ల నియోజకవర్గం విడుదల తేదీ : ఆగస్ట్ 12, 2022 నటీనటులు : నితిన్, కృతి శెట్టి, సముద్రఖని, జయప్రకాశ్, మురళీశర్మ, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శ్యామల, కోటేశ్వరరావు, బ్రహ్మాజీ, షేకింగ్ శేషు తదితరులు సంగీతం : మహతి స్వరసాగర్ సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ళ నిర్మాణం : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి కథ- దర్శకత్వం : యం.యస్. రాజశేఖర్ రెడ్డి వరుస పరాజయాలతో రేసులో వెనుకబడ్డ నితిన్.. ఎలాగైనా తిరిగి ఫామ్‌లోకి రావాలనే పట్టుదలతో పక్కా కమర్షి్యల్ కథాంశమైన ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో ఈ రోజే (శుక్రవారం) థియేటర్స్‌లోకి వచ్చాడు. విడుదలకు ముందు టీజర్, సింగిల్స్, ట్రైలర్‌తో భారీ అంచనాల్ని నెలకొల్పిన ఈ సినిమా.. ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది? ఈ చిత్రంతో నితిన్ హిట్టందుకుంటాడా అనే విషయాలు రివ్యూలో చూద్దాం. (Macharla Niyojakavargam movie review) కథ : మాచర్లలో రాజప్ప (సముద్రఖని) గీసిందే గీత. చేసిందే చట్టం. ఆయనదే…
చిత్రం : కార్తికేయ 2 (Karthikeya 2 review) విడుదల తేదీ : ఆగస్ట్ 13, 2022 నటీనటులు : నిఖిల్ సిద్దార్ధ్(Nikhil), అనుపమా పరమేశ్వరన్(Anupama parameswaran), శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష, ప్రవీణ్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, అప్పాజీ అంబరీష, తులసి తదితరులు సంగీతం : కాలభైరవ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ : కార్తిక్ ఘట్టమనేని నిర్మాణం : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దర్శకత్వం : చందు మొండేటి(Chandoo mondeti) ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకుల్ని మెప్పించే యంగ్ హీరో నిఖిల్.. తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2. సూపర్ హిట్టైన ‘కార్తికేయ’ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. చందుమొండేటి దర్శత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ రోజే (ఆగస్ట్ 13) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? నిఖిల్ ఖాతాలో మరో హిట్టు పడుతుందా? లేదా? అన్న విషయాల్ని రివ్యూలోచూద్దాం.. …
లక్నో,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): ఉత్తర్‌ప్రదేశ్ బాందా జిల్లాలోని యమునా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో తాజాగా 8 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటి వరకు మొత్తం 11 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. యమునా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉత్తర్‌ప్రదేశ్ బాందా జిల్లాలో 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తాజాగా 8 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటి వరకు మొత్తం 11 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. మర్కా నుంచి ఫతేపుర్‌లో ఉన్న జరౌలీ ఘాట్‌కు యమునా నది విూదుగా వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బలమైన గాలులతో సుడిగుండం ఏర్పడి.. పడవ మునిగిపోయిందని తెలుస్తోంది. పడవలో రాఖీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న మహిళలే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. గజ ఈతగాళ్లు,…
ఎంపి మాధవ్‌ను వెనకేసుకు రావడం సిగ్గుచేటు మండిపడ్డ టిడిపి మహిళా నేత అనిత అమరావతి,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని మహిళా మంత్రులు కూడా వెనకేసుకు రావడం సిగ్గుచేటని టీడీపీ మహిళానేత వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. ఆయనపై చర్య తీసుకునే బదులు వెనకేసుకుని రావడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆమె శనివారం విూడియాతో మాట్లాడుతూ… గోరంట్ల విషయంలో ఎస్పీ ఫకీరప్ప క్లీన్‌చిట్ ఇవ్వలేదన్నారు. ఒరిజినల్ వీడియో లేదని మాత్రమే అన్నారని తెలిపారు. ఒరిజినల్ వీడియో దొరికితే విచారణ జరిపి చర్య తీసుకుంటామన్నారని అన్నారు. అమెరికా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకునే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఈ రిపోర్ట్‌పై కూడా ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా మాధవ్ హోర్డింగ్‌లు పెట్టించుకున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢల్లీి,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపి, కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ జైరాం రమేష్ తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు ట్వీట్ చేశారు. గతంలో ఆమెకు కరోనా సోకగా.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. రెండు నెలల తర్వాత సోనియాకు మరోసారి మహమ్మారి సోకింది. ఇటీవల ఆమె కుమార్తె ప్రియాంక గాంధీకి కూడా మరోసారి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణైంది.
పాఠశాలల్లో వసతుల కల్పనకమిషనర్‌గా కాటంనేని అమరావతి,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాంకేతిక విద్యా శాఖ డైరెక్టరుగా నాగరాణి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతిక విద్యా శాఖ డైరెక్టర్ బాధ్యతల నుంచి పొల భాస్కర్ రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. జౌళి, చేనేత శాఖ కమిషనర్ గా ఎం. ఎం నాయక్ నియమితులయ్యారు. అలాగే ఎం. ఎం నాయక్‌కు ఆప్కో సీఎండీ, ఖాదీ విలేజ్ బోర్డు సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మికి సాంఫీుక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశించారు. పాఠశాల విద్య శాఖలో పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన కమిషనర్‌గా కాటంనేని భాస్కర్ నియమితులయ్యారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకాధికారిని నియమించాలని సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం కొత్త…
టిటిడికి సుబ్బరామిరెడ్డి కితాబు తిరుపతి,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. కేంద్ర మాజీ మంత్రులు టీ.సుబ్బిరామిరెడ్డి, చింతా మోహన్ పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ…. టీటీడీ పరిపాలను ప్రస్తుతం చాలా బాగుందన్నారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి , ఈఓ ధర్మారెడ్డి నేతృత్వంలో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. భక్తలు సేవలో వారి సేవలు అమోఘమన్నారు. అన్యాయానికి అవకాశం లేకుండా భక్తులకు సేవ చేస్తున్నారన్నారు. ఎంత మంచి పాలన ఉన్నా దానిపై రాళ్లు వేయడం మామూలే అన్నారు. రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా చేసిన వ్యక్తిగా టీటీడీ పాలనను ప్రశంసిస్తున్నట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు.
దాదాపు మూడుకోట్లకు మోసం చేసిన దుండగులు హైదరాబాద్,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): అడ్రస్ లేని కంపెనీల పేరు విూద కెనరా బ్యాంకు బాలానగర్ బ్రాంచ్ రెండున్నర కోట్లకు పైగా కేటుగాళ్లు టోపీ పెట్టారు. ఏఎఫ్‌ఎస్ కన్‌స్టక్షన్స్ర్ పేరుతో అడ్రస్ లేని సంస్థని సృష్టించారు. కెనరా బ్యాంకులో అహ్మద్ ఫయాజ్ అహ్మద్, మహ్మద్ చాంద్ పాషా అనే వ్యక్తులు 1.30 కోట్ల ఋణం తీసుకుని ఎగ్గొట్టారు. ఇదే తరహాలో తిరుమల ఎంటర్ ప్రైజెస్ సివిల్ ఇంజనీరింగ్ సంస్థను సృష్టించి 1.41 కోట్ల ఋణం తీసుకుని ప్రసాద్ రెడ్డి, మహాలక్ష్మి అనే ఇద్దరు వ్యక్తులు ఎగ్గొట్టారు. క్షేత్ర స్థాయి పరిశీలనతో మోసాలు వెలుగులోకి వచ్చాయి. సంస్థల కార్యాలయాలు, భాగస్వాముల చిరునామాలు అన్ని తప్పేనని, రుణ దరఖాస్తు కోసం ఫేక్ డాక్యూమెంట్స్ సృష్టించినట్లు నిర్దారణ అయ్యింది. సీసీఎస్‌లో కెనరాబ్యాంక్ బాలానగర్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.
కరోనా లక్షణాలతో సెల్ఫ్ క్వారంటైన్ హైదరాబాద్,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): మునుగోడులో పాదయాత్రకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దూరంగా ఉన్నారు. కరోనా లక్షణాలతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా పరీక్షకు శాంపిల్స్‌ను పంపించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నారాయణపురం నుంచి చౌటప్పల్ వరకు కాంగ్రెస్ పాదయాత్ర చేపట్టింది. మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. దీంతో అన్ని పార్టీలు ఉప ఎన్నికల కసరత్తును ప్రారంభించాయి.