లక్నో,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): ఉత్తర్‌ప్రదేశ్ బాందా జిల్లాలోని యమునా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో తాజాగా 8 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటి వరకు మొత్తం 11 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. యమునా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉత్తర్‌ప్రదేశ్ బాందా జిల్లాలో 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తాజాగా 8 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటి వరకు మొత్తం 11 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. మర్కా నుంచి ఫతేపుర్‌లో ఉన్న జరౌలీ ఘాట్‌కు యమునా నది విూదుగా వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బలమైన గాలులతో సుడిగుండం ఏర్పడి.. పడవ మునిగిపోయిందని తెలుస్తోంది.
పడవలో రాఖీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న మహిళలే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. గజ ఈతగాళ్లు, ఇతర సిబ్బందితో సహాయక చర్యలు వేగవంతం చేశారు. అదనపు ఎస్పీ లక్ష్మీ నివాస్ మిశ్రా మాట్లాడుతూ.. ఏడెనిమిది మంది ఈదుకుంటూ సురక్షితంగా బయటకు వచ్చేశారని.. మిగతా వారంతా మునిగిపోయారన్నారు.సీఎం యోగి విచారం: ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల పరిహారం ప్రకటించారు. స్థానిక ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తగిన వైద్యసాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
““““““
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!