ఎంపి మాధవ్‌ను వెనకేసుకు రావడం సిగ్గుచేటు
మండిపడ్డ టిడిపి మహిళా నేత అనిత
అమరావతి,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని మహిళా మంత్రులు కూడా వెనకేసుకు రావడం సిగ్గుచేటని టీడీపీ మహిళానేత వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. ఆయనపై చర్య తీసుకునే బదులు వెనకేసుకుని రావడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆమె శనివారం విూడియాతో మాట్లాడుతూ… గోరంట్ల విషయంలో ఎస్పీ ఫకీరప్ప క్లీన్చిట్ ఇవ్వలేదన్నారు. ఒరిజినల్ వీడియో లేదని మాత్రమే అన్నారని తెలిపారు. ఒరిజినల్ వీడియో దొరికితే విచారణ జరిపి చర్య తీసుకుంటామన్నారని అన్నారు. అమెరికా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకునే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఈ రిపోర్ట్‌పై కూడా ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా మాధవ్ హోర్డింగ్‌లు పెట్టించుకున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!