Author: admin

ANDHRAPATRIKA : – కెనడాలో జీవన వ్యయ భారం భారీగా పెరిగింది. దీంతో అక్కడ ఉచితంగా ఆహారం అందించే ఫుడ్‌ బ్యాంకులపై అంతర్జాతీయ విద్యార్థులు ఆధారపడుతున్నారు. స్థానిక మీడియా ప్రకారం మార్చిలో 20లక్షల మంది ఫుడ్‌ బ్యాంకులను ఆశ్రయించారు. గతేడాదితో పోలిస్తే 6 శాతం పెరగగా.. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణం, జీవన వ్యయ ఖర్చులు విపరీతంగా పెరిగాయన్నారు కెనడా ఫుడ్‌ బ్యాంక్స్‌ సీఈవో కిర్‌స్టిన్‌ బియర్డ్‌స్లీ. దీంతో తాము తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల జీవన వ్యయ పరిమితిని ప్రభుత్వం ఇటీవల రెట్టింపు చేసింది. 10వేల డాలర్లుగా ఉన్న స్టూడెంట్‌ డిపాజిట్‌ను జనవరి 1 నుంచి 20,635 డాలర్లకు పెంచింది. ఈ నేపథ్యంలో మొదటి ఏడాది విద్యార్థులకు.. ఫుడ్‌ బ్యాంకు సౌలభ్యం దూరం చేయడాన్ని.. ది గ్రేటర్‌ వాంకోవర్‌ ఫుడ్‌ బ్యాంకు సమర్థించుకుంటోంది. ఇటీవల పెంచిన…

Read More

ANDHRAPATRIKA : – అది మహిళల సంరక్షణ కోసం పెట్టిన గృహం.. న్యాయస్థానం ఆదేశాలతో ఆ హోమ్‌లో సంరక్షిస్తుంటారు. అయితే అక్కడ నుంచి ఆరుగురు యువతులు పరారయ్యారు. అది కూడా మామూలుగా కాదు, పక్కా ప్లాన్ తో..! అక్కడ ఉన్న సిబ్బందికి భయపెట్టి బెదిరించి మరీ.. సినీ స్టైల్ లో జరిగిన ఈ ఘటన ఉలిక్కిపడేలా చేసింది..! విశాఖపట్నంలోని పెందుర్తి ఆదిత్యనగర్‌లో బాధిత మహిళల కోసం సంరక్షణ గృహం నిర్వహణ జరుగుతుంది. శక్తి సదన్ పేరుతో ఉన్న ఈ హోమ్‌ను సీడ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తోంది. ఇక్కడ నుంచి ఇటీవల ఓ యువతి పరారైంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి పారిపోయి నెల రోజులు గడవక ముందే, మరో ఆరుగురు పారిపోయారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమెన్ ట్రాఫికింగ్ కేసులో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన…

Read More

ANDHRAPATRIKA ; – ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన కోనేరు ఉంది. ఆ కోనేరులో పంచబుగ్గలు ఉన్నాయి. భక్తులు స్వామిని దర్శించిన అనంతరం కోనేరు వద్దకు వెళ్లి హరహర అంటే చాలు ఓ వింత సాక్షాత్కరిస్తుంది భక్తులు కోనేరు వద్ద హరహర అనగానే పంచ బుగ్గల నుంచి నీరు బుడబుడా అని శబ్దం చేస్తూ పైకి వస్తాయి. ఆ వింతను భోగేశ్వర స్వామి మహిమగా భక్తులు కీర్తిస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఈ ఆలయం కలిదిండికి తూర్పు ఆగ్నేయంలో నిర్మించారు. వేంగిరాజు రాజరాజ చోళుడు పరిపాలించిన కాలంలో ఈ దేవాలయం నిర్మించినట్టుగా స్థల పురాణం చెబుతుంది. రాజ రాజ చోళుడు కుమారుడు రాజరాజ నరేంద్రుని కాలంలో ఒక రైతు నాగలితో పొలందున్నుతుండగా భూమిలో నాగలి కర్రుకు లింగాకారంలో ఉన్న శిల కనిపించింది. కొంత భాగం అది విరిగి అక్కడి నుండి రక్తం వరదలా పారింది. దీంతో…

Read More

స్కూల్‌యూనిఫామ్‌లో సూర్యనమస్కారాలు.. చిన్నారి టాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా.. ANDHRAPATRIKA : – – మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన సోషల్ మీడియా ఖాతాలో ప్రతిరోజూ వివిధ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసే వీడియోలు ఎంతో ఆసక్తికరంగా, అందరికీ స్పూర్తిదాయకంగా ఉంటాయి. కొత్త ఆవిష్కరణలు, ఏదో ఒక రంగంలో చేసిన అద్భుతాలకు సంబంధించినవిగా ఉంటాయి. ఈ సారి కూడా అలాంటిదే ఒక అద్భుతమైన వీడియోని షేర్‌ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ వీడియో ఓ చిన్నారికి సంబంధించినది. ఆనంద్‌ మహీంద్రా ఆ చిన్నారి పట్ల ఫిదా అయినట్టుగా తెలుస్తోంది… పూర్తి వివరాల్లోకి వెళితే… వైరల్‌ వీడియోలో ఓ చిన్నారి స్కూల్ డ్రెస్‌లో కనిపిస్తుంది. ఆ చిన్నారి సూర్య నమస్కారాలు చేస్తోంది. ఆమె చేస్తున్న ఒక్కో సూర్య నమస్కార భంగిమ అందరినీ ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. అంతేకాదు..…

Read More

ఎందుకమ్మా ఇలా చేశావ్.. కన్న కొడుకు కళ్లలోనే కారం కొట్టి.. ANDHRAPATRIKA : – – ఆస్తుల ముందు అప్యాయతలు, అనురాగాలు కనుమరుగైపోతున్నాయి.. కన్న వారిని సైతం అడ్డుతొలగించుకునేందుకు సైతం వెనుకాడటం లేదు. అర ఎకరం పొలం కోసం ఆరు నెలల నుండి కొనసాగుతున్న వివాదం.. ఏకంగా ఆ తల్లి కన్న కొడుకునే చంపుకునే వరకు వెళ్లింది.. అయితే పోలీసులు విచారణలో కన్న కొడుకును తల్లి, అతని సోదరులు కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారని తెలుసుకున్న పోలీసులు అందరిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరవై ఏళ్ళ క్రితం క్రోసూరు మండలం హసనాబాద్ కు చెందిన హుస్సేన్ కి మున్నిబీకి వివాహమైంది. వీరికి మహబూబ్ బాషా జన్మించిన రెండేళ్ల తర్వాత విబేధాలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మున్నీబి తమ్మవరానికి చెందిన కరిముల్లాను పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. కరిముల్లా, మున్నిబీలకు ఇద్దరూ…

Read More

కొత్త చట్టాల అమలులో సరికొత్త అధ్యాయం.. ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి తీర్పు.. ఏంటో తెలుసా.. ANDHRAPATRIKA : — ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలిసారిగా ప్రకాశం జిల్లాలోని కనిగిరి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్ జడ్జి కె .భరత్ చంద్ర శుక్రవారం దొంగతనం కేసులో సామాజిక సేవా శిక్ష (కమ్యూనిటీ సర్వీస్) ను విధిస్తూ తీర్పునిచ్చారు. నూతన నేర న్యాయ చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి తీర్పుగా వెలువడింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రకాశంజిల్లా కనిగిరికి చెందిన పోల అంకయ్య నవంబర్ 2 వ తేదీ నుంచి డిసెంబర్ 31, 2024 వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కనిగిరి ప్రధాన కూడళ్లను, వీధులను శుభ్రపరిచే పనుల్లో పాల్గొనవలసి ఉంటుంది. ఈ పనిని కనిగిరి మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో చేయాలని న్యాయమూర్తి భరత్‌ చంద్ర ఆదేశాలు జారీ చేశారు.…

Read More

 కీలక మార్పులు చేయనున్న యూట్యూబ్‌.. ఇకపై ఆ ఆప్షన్‌ ఉండదా ANDHRAPATRIKA : – – యూట్యూబ్‌లో షార్ట్‌ వీడియోలకు ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో కీలక మార్పు చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా యూట్యూబ్‌ షార్ట్స్‌లో ఇంటర్‌ఫేస్‌ని పరీక్షిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌ షార్ట్స్‌కి డిజ్‌లైక్‌ ఆప్షన్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆప్షన్‌ను తొలగించనున్నారని తెలుస్తోంది. ఇందుకు బదులుగా సేవ్‌ బటన్‌ను తీసుకురానున్నారని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. యూట్యూబ్‌లో ఇకపై డిజ్‌లైక్‌ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ఇప్పటికే కొందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ అమలు చేయనున్నారు. దీంతో షార్ట్స్‌ను సులభంగా సేవ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. సేవ్‌ ఆప్షన్‌ నొక్కగానే మీరు దీన్ని ఇప్పటికే ఉన్న ప్లేజాబితాకు సేవ్ చేయాలనుకుంటున్నారా లేదా కొత్త ప్లేజాబితాని సృష్టించాలనుకుంటున్నారా అని యూట్యూబ్‌ అడుగుతుంది. ఇదిలా…

Read More

ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసిన వన్‌ప్లస్‌ 13.. ధర ఎంతో తెలుసా.? ANDHRAPATRIKA : – – చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్ల్‌ ఎట్టకేలకు మార్కెట్లోకి వ్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. గురువారం చైనా మార్కెట్లో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్‌ను 24 జీబీ ర్యామ్, వన్‌ టిగా బైట్ స్టోరేజీ వేరియంట్‌తో తీసుకొస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో 6.82 ఇంచెస్‌తో కూడిన క్వాడ్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 1440 x 3168 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు…

Read More

దేవుడు బ్రతికిస్తాడని బిల్డింగ్‌ పైనుంచి దూకాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ANDHRAPATRIKA : – – తమిళనాడులో దారుణం జరిగింది. సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ.. మూఢ నమ్మకాలపై పిచ్చిగా నమ్మకం ఉంచిన ఓ యువకుడు చేయకూడదని పని చేశాడు. దేవుడు తనను బ్రతికిస్తాడనే పిచ్చి నమ్మకంతో.. ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు ఓ 19 ఏళ్ల యువకుడు. కోయంబత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. చివరికి ఏం జరిగింది.. అసలేమైందో ఇప్పుడు చూద్దాం.. వివరాల్లోకి వెళ్తే.. పెరుందురైలోని మెక్కూర్ గ్రామానికి చెందిన ప్రభు అనే యువకుడు బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ డేటా సైన్స్‌లో మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా మనస్థాపానికి గురైన అతడు.. దేవుడు తిరిగి బ్రతికిస్తాడనే పిచ్చి నమ్మకంతో బిల్డింగ్ పైనుంచి దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అక్టోబర్ 28న సాయంత్రం 6.15…

Read More

Petrol pump dealers: పెట్రోలు పంపు డీలర్లకు కమీషన్ పెంపు.. ధరలు పెరిగే అవకాశముందా..? ANDHRAPATRIKA : – – ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కమీషన్ పెంపుపై ఇటీవల ఎక్స్ లో పోస్ట్ చేసింది. పెండింగ్ లో ఉన్న వ్యాజ్యం పరిష్కారాన్ని అనుసరించి డీలర్ల మార్జిన్ ను సవరించినందుకు ఆనందంగా ఉందని తెలిపింది. కొత్త కమీషన్ మార్జిన్ 2024 అక్టోబర్ 30 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. దీనివల్ల రిటైల్ విక్రయ ధరపై ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. కస్టమర్ సర్వీసు ప్రమాణాలను, రిటైల్ అవుట్ లెట్ సిబ్బంది సంక్షేమాన్ని పెంచడానికి దోహదపడుతుందని అభిప్రాయ పడింది. అలాగే బీపీపీఎల్, హెచ్ పీసీఎల్ కూడా తమ డీలర్ల కమీషన్ ను పెంచుతున్నట్టు తెలిపారు. సరకు రవాణాలో అంతరాష్ట్ర హేతుబద్దీకరణ నేపథ్యంలో చమురు సంస్థలు కమీషన్ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీని వల్ల రిటైల్ విక్రయాల్లో వైవిధ్యం తగ్గుతుంది. మోడల్ నియామావళి అమల్లో…

Read More