Author: admin

Telangana: సాగర్ నుంచి శ్రీశైలం వరకు పడవ ప్రయాణం.. టికెట్‌ ధరలు ఇలా.. ANDHRAPATRIKA : – – నాగార్జున సాగర్‌ – శ్రీశైలం ప్రయాణం ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం. పచ్చని కొండల మధ్యలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ప్రవాహం.. నదీజలాల మీదుగా వచ్చే చల్లని పిల్లగాలులు. చుట్టూ దట్టమైన నల్లమల అడవులు. పక్షుల కిలకిలరావాలు. ఇలా కృష్ణమ్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఈ ప్రయాణం సాగుతోంది. తొలిరోజు 40 మంది పర్యాటకులతో కదిలిన లాంచీ నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లే టూర్ ప్యాకేజీ తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించింది. నాగార్జునసాగర్ లాంచీ స్టేషన్ నుంచి తొలిరోజు 40 మంది పర్యాటకులతో లాంచీ కదిలింది. ఎక్కువ మంది పర్యాటకులు ప్రయాణించేలా డబుల్‌ డెక్కర్‌ తరహాలో ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు. ఈ లాంచీ ప్రయాణం సింగిల్ వేకు పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600గా నిర్ణయించారు. రౌండప్ టూర్ ప్యాకేజీ…

Read More

రుషికొండ భవనాలను ఏం చేయాలి..? ప్రభుత్వ ఆలోచన ఇదేనా..! ANDHRAPATRIKA : — -విశాఖ పర్యటనలో రుషికొండ కట్టడాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు..విలాసాల కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్‌ కట్టుకున్నారని మండిపడ్డారు. రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలు నిర్మించుకోలేదన్న ముఖ్యమంత్రి…వందల కోట్ల ప్రజాధనంతో వ్యక్తిగత విలాసాల కోసం కట్టిన ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నామన్నారు. ఈ మేరకు సలహాలు-సూచనలను ఇవ్వాలంటూ ప్రజలకు సూచించారు. వైసీపీ హయాంలో రూ.500 కోట్ల ఖర్చుతో నిర్మాణాలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసి రుషికొండపై ఏడు బ్లాక్‌ల్లో భవనాలు నిర్మించారు. అయితే జగన్‌ ప్రభుత్వం ఓటమి పాలవడంతో..ఈ భారీ భవనాలు చర్చనీయాంశమయ్యాయి. గత నాలుగు నెలలుగా ఇక్కడి భవనాలు, ఉద్యానవనాల నిర్వహణ, విద్యుత్‌ వినియోగం కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుండడంతో.. దీనిపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తోంది ఏపీ…

Read More

AP – Telangana: విజయవాడ-హైదరాబాద్‌ రూట్‌లో రిటన్‌ రష్‌ ANDHRAPATRIKA : – -ఫ్యామిలీతో సొంతూళ్లకు వెళ్లి… దీపావళి పండుగతోపాటు వీకెండ్‌ ఎంజాయ్‌ చేసిన వారంతా ఇప్పుడు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆదివారం ఒక్కరోజే వందలాది వాహనాలు హైవేలపైకి రావడంతో టోల్‌ప్లాజాల దగ్గర భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. వాహనాలన్నీ డెడ్‌ స్లోగా ముందుకు కదులుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. వాహనాల రద్దీతో హైదరాబాద్‌ చుట్టుపక్కల టోల్‌ప్లాజాలు కిటకిటలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇటు చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలన్నీ ఒక్కసారిగా రావడం టోల్‌ప్లాజాలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రద్దీ దృష్ట్యా కౌంటర్లు పెంచినా స్కానర్లు స్లోగా పనిచేస్తుండటంతో… వెహికిల్స్‌ కూడా అంతే స్లోగా ముందుకు కదులుతున్నాయి. అటు.. వరంగల్‌- హైదరాబాద్‌ హైవేపైనా ఇదే…

Read More

Panchayat Elections: పంచాయతీ సమరానికి సై.. క్లియర్‌కట్‌ సిగ్నల్ ఇచ్చేసిన తెలంగాణ సర్కార్! ANDHRAPATRIKA : – – అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మారిపోయింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలిపోయింది. తెలంగాణలో ప్రధాన పార్టీలు ఇప్పుడు మరో అగ్నిపరీక్షకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల జాతరకు.. త్వరలోనే తెరలేవబోతోంది. కొత్త సంవత్సరంలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. సర్పంచ్ ఎన్నికలకు డిసెంబర్ నెలలోనే ముహూర్తం ఫిక్స్ చేసినట్లు స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. 2025 జనవరి నెలలో గ్రామాలకు కొత్త సర్పంచ్‌లు వస్తారంటూ మీడియా చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంకావాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు ఉంటాయని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. తెలంగాణ…

Read More

అయ్యో పాపం. ఆకలిగా ఉందని ఎగ్ బోండా తిన్నాడు.. చివరకు ప్రాణాలే పోయాయిగా.. ANDHRAPATRIKA : – – పుట్టిన వాడికి మరణం తప్పదు.. ఇది అక్షర సత్యం.. అయితే, ఆ చావు మనిషిని ఎటు నుంచి ఆవహిస్తుందే చెప్పడం కష్టం. కరోనా అనంతరం కాలంలో ఊహించని మరణాలు పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారు ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. చిత్ర విచిత్ర కారణాలు మనిషిని మరణానికి దగ్గర చేస్తున్నాయి. గొంతులో ఆమ్లెట్‌, మాంసం ముక్క, కొబ్బరి ముక్క ఇరుక్కొని ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి నోట్లో కోడిగుడ్డు ఇరుక్కొని మృత్యువాతపడ్డాడు. అవును, మీరు చదివింది నిజమే.. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో జరిగింది ఈ విషాద సంఘటన..పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని లింగాల మండల కేంద్రంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని…

Read More

 భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త ఏడాది ఏదో తెలుసా? ANDHRAPATRIKA : – – గత కొన్నేళ్లుగా టెస్టు ఫార్మాట్‌లో టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. కానీ 2024లో టీమ్ ఇండియా ప్రదర్శన అంచనాల కంటే దారుణంగా ఉంది. భారత జట్టు న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఈ ఏడాది చివరి టెస్టు సిరీస్ ఆడింది. అయితే ఈ సిరీస్‌లో భారత ఆటగాళ్లు చాలా అవమానకరమైన ప్రదర్శన కనబరిచారు. భారత జట్టు 3 మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా గెలవలేక క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్‌ భారత్‌కు వచ్చి టెస్టు సిరీస్‌ను గెలవడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో 55 ఏళ్ల తర్వాత భారత్‌లో ఇంత దారుణమైన పరిస్థితి కనిపించింది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త సంవత్సరం.. ఈ ఏడాది స్వదేశంలో టీమిండియా మూడు టెస్టుల సిరీస్‌లు ఆడింది. ఈ ఏడాది తొలి టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడింది. తొలి మ్యాచ్‌లో 28…

Read More

సరదా చావుకొచ్చింది..! ఫన్‌రైడ్‌ కోసం పోయి ప్రాణాలు పోగొట్టుకుంది.. ANDHRAPATRIKA : – – చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరులో విషాద సంఘటన చోటు చేసుకుంది. తిరుచానూరులోని శిల్పారామంలో క్రాస్‌వీల్‌ ఓ మహిళను మింగేసింది. ఆదివారం సెలవు దినం కావడంతో శిల్పారామం సందర్శనలో క్రాస్‌ వీల్‌లో ఇద్దరు మహిళలు కూర్చొని తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా అది విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలిని తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన లోకేశ్వరిగా గుర్తించారు. శిల్పారామం క్యాంటీన్ వద్దగల వన్ సైడ్ జాయింట్ క్రాస్ రైడ్ లో ఈ ప్రమాదం జరిగింది. క్రాస్ వీల్ తిరుగుతున్న సమయంలో దాదాపు 20 అడుగుల ఎత్తు నుండి పడిపోయారు ఇద్దరు మహిళలు. ప్రమాదంలో ఒక మహిళ అక్కడి కక్కడే మృతిచెందగా…

Read More

నిత్యం అలసటగా ఉంటున్నారా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే.. ANDHRAPATRIKA : – – అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడి వల్ల అలసటతో బాధపడుతుంటారు. ఇటీవల ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఎలాంటి కారణం లేకుండా నిత్యం అలసటతో ఉంటున్నారా.? అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో విటమిన్ల లోపం కారణంగా ఇలా అలసటకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐదు రకాల విటమిన్‌ లోపం అలసటకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. * శరీరంలో ఐరన్‌ లోపిస్తే ఇలాగే నిత్యం అలసటగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హిమోగ్లోబీన్‌ తయారీలో కీలక పాత్ర పోషించే ఐరన్‌ లోపం కారణంగా ఎనీమియా సమస్య వస్తుంది. దీంతో రక్తంలో ఆక్సిజన్‌ అన్ని అవయవాలకు సరిగ్గా సరఫరా కాదు. దీంతో తల తిరగడం, నీరసం వంటి సమస్యలు వస్తాయి. తీసుకునే ఆహారంలో…

Read More

ANDHRAPATRIKA : – మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామం నుండి వస్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుకు ఒక పక్కన ధాన్యం ఆరబోయడంతో ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగి నలుగురు మృత్యువాత పడ్డారు. మృతులు అదే గ్రామానికి చెందిన మన్నే ఆంజనేయులు, ఆయన తమ్ముని భార్య లావణ్య, కూతురు సహస్ర, స్వాతిగా గుర్తించారు. రోడ్డుపై విచక్షణారహితంగా పడి ఉన్న మృతదేహాలను చూసి స్థానికులు విలపించారు. ఢీ కొట్టిన ట్రాక్టర్ ఆపకుండా వెళ్లిపోవడంతో..పోస్ట్ మార్టం చేయకుండా మృతదేహాలను తరలించకుండా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు నచ్చజెప్పడంతో మృతదేహాలను తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Read More

ANDHRAPATRIKA :-  తెలంగాణలో పువ్వుని పూజించే బతుకమ్మని పేర్చడానికి ఉపయోగించే పువ్వుల్లో ఒకటి తంగేడు పువ్వు. బంగారు రంగులో గుత్తులు గుత్తులుగా అందంగా కనిపించే ఈ తంగేడు పువ్వులో అనేక ఔషధ గుణాలున్నాయి. అసలు తంగేడు మొక్క అనేక ఆరోగ్య సమస్యలను తీర్చే మంచి ఔషధం. కావల్సిన పదార్థాలు: తంగేడు పువ్వులు – ఒక కప్పు పచ్చిమిర్చి- ఎనిమిది నువ్వులు – మూడు స్పూన్లు చింతపండు౦- కొంచెం ఉప్పు రుచికి సరిపడా జీలకర్ర-ఒక స్పూన్ వెళ్ళుల్లి – నలుగు రెమ్మలు పసుపు- చిటికెడు నూనె – నాలుగు స్పూన్లు పోపుకు కావాల్సిన దినుసులు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండు మిర్చి వెల్లుల్లి మినప పప్పు శనగ పప్పు తయారీ విధానం: ముందుగా తంగేడు పువ్వును తీసుకుని పువ్వులు మాత్రమే అంటే పసుపు రంగులో ఉన్న పువ్వులను తీసుకుని శుభ్రంగా వలిచి కడగాలి. చింత పండును కొంచెం నీరు పోసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత…

Read More