Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
Author: admin
తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం సమరశంఖం పూరించబోతోంది. మరో ఏడాదిన్నర వ్యవధిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడం, టీఆర్‌ఎస్ కంచుకోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా తెలంగాణను బీజేపీ ఎంపిక చేసుకుంది. ఇందుకోసం హైదరాబాద్ వేదికగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయాలకు కీలక మలుపు కాబోతున్నాయన్న ధీమాతో కమలనాథులు ఉన్నారు. వీటిని విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయికి దూసుకుపోవాలని భావిస్తున్నారు. అధికార టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఓటువేసే వారికి తక్షణ ప్రత్యామ్నాయంగా తామే గుర్తుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రంలో తాము అధికారంలో ఉన్నందున ప్రధాని మోదీ ప్రభుత్వ విజయాలను తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఐదేళ్ల తర్వాత దేశ రాజధాని వెలుపల,…
ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ కబ్జా చేసినట్టుగా అధికారులు నిర్థారించిన భూములను రీఅసైన్ చేస్తూ బుధవారం పట్టాలను పంపిణీ చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో మొత్తం 85.19 ఎకరాల భూములను 65 మంది రైతులకు అధికారులు రీఅసైన్ చేశారు. అయితే గతేడాది డిసెంబరు 6న జిల్లా కలెక్టర్ హరీశ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… జమున హేచరీస్ 70.33 ఎకరాలను కబ్జా చేసినట్లు పేర్కొన్నారు. కానీ, బుధవారం 85.19 ఎకరాల భూమిని అసైన్డ్‌దారులకు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొనడం గమనార్హం. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, మాసాయిపేట తహసీల్దార్ మాలతీ రీఅసైన్డ్ పట్టాలను భూముల వద్దనే రైతులకు అందజేశారు. కాగా… పట్టాల పంపిణీ జరిగే వరకు అధికారులు సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. భూముల వద్దకు రెవెన్యూ అధికారులు ఉదయమే చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీగా పోలీసు…
వైసీపీ (Ycp)కి ప్లీనరీ (Plenary) సమావేశాల్లో నిరుత్సాహం తప్పడంలేదు. మంత్రుల సభకు జనాలు కరవు అవుతున్నారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam District) స్థాయి ప్లీనరీ జనాలు లేక అట్టర్ ఫ్లాప్ అయింది. జిల్లా ఆవిర్భావం తర్వాత సత్తా చాటాలనుకున్న నేతల ఆశలపై నీళ్లు చల్లింది. పార్వతీ పురం జిల్లాలో జన సమీకరణ బాధ్యతను స్థానిక శాసన సభ్యుడు అలజంకి జోగారావు (Mla alajanki Jogarao) తీసుకున్నారు. జనాన్ని భారీగా తరలించారు. అయితే అది నీటి బుడగ్గానే మారిపోయింది. సమావేశం ఆరంభంలో ఉన్న జనాలు సగం వరకు కూడా ఉండలేదు.
బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి పెద్దకడుబూరు మండలం కంపాడు, మురవని, కబలదినన్నే, జాలవాడి గ్రామాల్లో పర్యటించారు. తన ప్రసంగంలో ఎమ్మెల్యే బాల నాగిరెడ్డిపై ఆగ్రహ వ్యక్తం చేశారు. చంద్రబాబు భిక్షతో మొదటి సారి ఎమ్మెల్యే అయిన బాల నాగిరెడ్డి ఆయననే విమర్శించడం తగదన్నారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంచన చేరి, ఆ తర్వాత జగన్‌తో కలిసి నీతివాక్యాలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్లీనరీకి డబ్బులు పంచి తెచ్చిన జనం ముందు పిచ్చి కూతలు కూయడం మంచి లక్షణం కాదన్నారు. తాను బల నిరూపణ చేయాలనుకుంటే పసుపు సైనికులు వేల సంఖ్యలో స్వచ్ఛందంగా వస్తారని టీడీపీ నేత తిక్కారెడ్డి పేర్కొన్నారు.
ఆదాయాన్ని బట్టి చెక్‘పోస్టు’కు ధర! దీనికి అదనంగా ప్రతి నెలా కప్పం! ఇది రవాణా శాఖలో మొదలైన కొత్తరకం బదిలీల దందా! రవాణా శాఖలో ఉద్యోగులు, అధికారుల బదిలీల ప్రక్రియ జరుగుతుండగానే… ఆ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ను మరోచోటికి బదిలీ చేసేశారు. ఇది సంచలనం సృష్టించింది. మరోవైపు… ఒక కీలక ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి ‘పోస్టింగ్’లను అమ్మకానికి పెట్టినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం… విజయవాడ ఆటోనగర్‌లోని ఒక అతిథి గృహం వేదికగా ఈ దందా మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు పన్నెండు చెక్‌పోస్టులు, సింగిల్ పాయింట్‌లలో పోస్టింగ్ కోసం రూ.15 లక్షల నుంచి 25 లక్షల వరకూ వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది. రవాణా శాఖలో బదిలీలకు ప్రభుత్వం జీఓ విడుదల చేయగానే… పైరవీల సందడి మొదలైంది. అయితే… బదిలీ కోరుకునే వారు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని రవాణాశాఖ కమిషనర్‌గా ఉన్న కాటమనేని భాస్కర్…
డీఏ బకాయిల సొమ్ములు వేసినట్లే వేసి… మళ్లీ లాక్కున్న వైనంపై ఉద్యోగులు భగ్గుమన్నారు. సుమారు 90వేల మంది ఉద్యోగులకు చెందిన రూ.800 కోట్లు వారి జీపీఎఫ్ ఖాతాల నుంచి మాయమైపోయాయి. ఇది… ఇప్పటిదాకా బయటపడిన లెక్క. ఇంకా ఎన్ని లక్షల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బులు పోయాయో తెలియదు. దీంతో… అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ఉద్యోగ సంఘా ల నేతలు బుధవారం సచివాలయానికి క్యూ కట్టారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సూర్యనారాయణ, ఆస్కార్‌రావు, ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఒకరి వెంట మరొకరు సచివాలయానికి వచ్చారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, కార్యదర్శి సత్యనారాయణలతో భేటీ అయ్యారు. ‘‘జీపీఎఫ్ ఖాతాల్లో వారి అనుమతి లేకుండా సొమ్ము మాయం చేయడంపై ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. డీఏ ఎరియర్స్‌కు సంబంధించిన డబ్బులు క్రెడిట్ అయి మళ్లీ డెబిట్…
పోలవరం ప్రాజెక్ట్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహానేత వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్ట్ పోలవరం. పోలవరం పూర్తి చేసేందుకు కృషి చేస్తుంటే టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్‌పై బురద జల్లేందుకే చంద్రబాబు లేఖ రాశారు. షెకావత్‌కు చంద్రబాబు రాసిన లేఖ చెత్తబుట్టకు చేరుతుంది. చంద్రబాబు రాసిన లేఖ కుట్రపూరితమైన లేఖ. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబే కారణమని అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.
పీఎస్‌ఎల్‌వీ-సీ53ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. పీఎస్‌ఎల్‌వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ53.. కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం.
కేంద్ర ప్రభుత్వానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మధ్య నిధుల పంచాయితీ సద్దుమణగడం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ పై వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడుతోంది. ఇప్పటికే అప్పుల విషయంలో కొర్రి కొనసాగుతుండగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ కోసం చెల్లిస్తున్న నిధుల విషయంలో కొత్త పంచాయితీ రాజకీయ రచ్చ రేపుతోంది. ఉపాధి కూలీలకు డబ్బుల చెల్లింపుల్లో తెలంగాణ ప్రభుత్వమే జాప్యం చేస్తోందని బీజేపీ వాదిస్తుంటే.. అదేవిూ కాదని ఉపాధి పనుల డబ్బుల పంపిణీ కేంద్రం పరిధిలో ఉందని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ కౌంటర్ ఇస్తోంది.బీజేపీ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు టీఆర్‌ఎస్ సర్కార్ వాట్సాప్ ఆర్మీని తయారు చేస్తోంది. ఇందుకోసం ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉపాధి హావిూ పనులను మానిటరింగ్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎంఎస్ యాప్‌ను ఉపయోగిస్తోంది. పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఈ యాప్‌లో…
భద్రాచలం మన్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ( సీపీఐ ) భారీ స్కెచ్ వేసింది. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సీపీఐ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. భద్రాచలం అసెంబ్లీ సీటుపై కన్నేసిన సీపీఐ ఎన్నికల సంగ్రామానికి సన్నద్ధమవుతోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో సీనియర్లకు పెద్ద పీట వేస్తూ ముందడుగు వేస్తోంది. మండల కమిటీల పటిష్టతపై దృష్టి సారించింది. పార్టీకి దూరమైన గత శ్రేణులను దగ్గరికి తీసుకుంటోంది. భద్రాచలం నియోజకవర్గంలో నాలుగు దశాబ్దాలకు పైగా ఒంటి చేత్తో రాజకీయాలు శాసిస్తున్న సీపీఐ సీనియర్ నేత రావులపల్లి రాంప్రసాద్ ఈసారి మన్నెంలో సీపీఐ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పకడ్బందీ వ్యూహ రచనను అమలు చేస్తున్నారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ సీటుపై సీపీఐ కన్ను వేసింది. గత నాలుగు దశాబ్దాలుగా పలు పార్టీలతో ఎన్నికల రాజకీయ పొత్తులతో సీటును త్యాగం చేస్తూ వచ్చిన సీపీఐ ఈసారి ఎలాగైనా పోటీ చేసి తీరుతామని ఘంటాపథంగా చెబుతోంది.…