Author: admin

రోడ్లపై ప్రవాహంలో పొర్లుతున్న వర్షపు నీరు వాహనాల సైతం కొట్టుకుపోయేలా జల ప్రవాహం జలదిగ్బంధనలో ప్రజలు చార్మినార్ హైదరాబాద్

Read More

శ్రీ ఛ‌త్రపతి శివాజీ మహరాజ్‌కు అవమానం జరిగినట్లు ఓ భక్తుడు వీడియో క్లిప్ ద్వారా ఆరోపించడాన్ని టిటిడి శనివారం ఒక‌ ప్రకటనలో ఖండించింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులు త‌మ వాహ‌నాల‌కు వ్య‌క్తుల విగ్ర‌హాలు, ఫొటోలు, రాజ‌కీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్య‌మ‌త ప్ర‌చారానికి సంబంధించిన ప్ర‌చార సామ‌గ్రి తిరుమ‌లకు తీసుకువెళ్ల‌డాన్ని టిటిడి కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది. ఈ మేర‌కు రెండు రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన వాహనాన్ని అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద భ‌ద్ర‌తా సిబ్బంది నిలిపి త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా భ‌ద్ర‌తా సిబ్బంది న‌ల్ల‌టి రంగులో ఉన్న ఒక ప్ర‌తిమ‌ను గుర్తించారు. ఆ ప్ర‌తిమ ఛ‌త్ర‌ప‌తి శివాజీద‌ని తెలుసుకుని తిరుమ‌ల‌కు అనుమ‌తించారు. దేవతామూర్తుల చిత్రాలు తప్ప, వ్య‌క్తుల విగ్ర‌హాలు, రాజకీయ పార్టీల జెండాలు, ఇతర చిహ్నాలను ప్రదర్శించరాదని స‌ద‌రు భక్తుడిని కోరారు. అయితే ఆ భక్తుడు శివాజీ మహారాజ్‌ను టిటిడి అవమానించిందని ఆరోపిస్తూ తీవ్ర పదజాలంతో వీడియో…

Read More

కరోనా నుంచి దేశం విముక్తి పొంది ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించాలని శ్రీ సుబ్రమణ్య స్వామిని ప్రార్థించానని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు ఆడికృత్తిక సందర్బంగా శనివారం ఆయన సతీసమేతంగా తిరుత్తణి శ్రీ సుబ్రమణ్య స్వామి వారికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించారు ఆలయం వద్దకు చేరుకున్న శ్రీ సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ అధికారులు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు అనంతరం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తెచ్చిన పట్టువస్త్రాలను చైర్మన్ దంపతులు ఆలయ అర్చకులకు అందజేశారు ఈ వస్త్రాలను శ్రీ వల్లీ దేవసేన సుబ్రమణ్య స్వామి ఉత్సవ మూర్తులకు అలంకరించారు అనంతరం ఆలయ అర్చకులు అధికారులు చైర్మన్ దంపతులకు తీర్థ ప్రసాదాలు స్వామివారి వస్త్రాలు అందజేశారు ఈ సందర్బంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు ఆడికృత్తిక సందర్బంగా టీటీడీ తరపున శ్రీ వల్లీ దేవసేన సుబ్రమణ్య స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా…

Read More

శ్రీ స్వామి వారి దేవస్థానం ఆస్థాన మండపం నందు ధర్మ పదం కార్యక్రమంలో భాగంగా దేవస్థానము మరియు ప్రైడ్ ఇండియా కల్చర్ వారి ఆధ్వర్యంలో శ్రీ కాణిపాక వినాయక నృత్యంజలి భరతనాట్యం, కూచిపూడి, భక్తి పాటలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, దేవస్థానం ఏసి కస్తూరి, ఈ కార్యక్రమంలో కోలా వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్ ఫ్రైడ్ ఇండియా కల్చర్, వేదాంత రాజేష్ శ్యామ్ డాన్స్ మాస్టర్, దేవేంద్ర పిలై ఎస్వీ యూనివర్సిటీ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్, అమ్మ ఒడి పద్మనాభ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Read More

న్యాయస్థానాలు ఉండబట్టే తానింకా బతికున్నానని, న్యాయ వ్యవస్థే లేకపోతే ఈ మూడేళ్లలో తనలాంటి వాళ్లెందరినో వైకాపా వాళ్లు చంపేసి ఉండేవారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇప్పటికే చాలా మందిని చంపేశారని, కొందరి ఇళ్లు తగలబెట్టి, మరి కొందరివి పడగొట్టారని ఆరోపించారు. తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైకాపా నాయకుల కంటే అసభ్యంగా నేనేమీ మాట్లాడలేదు. ఆంధ్రా విశ్వవిద్యాలయం గురించి అయ్యన్నపాత్రుడు మాట్లాడింది తప్పు అని విశాఖ పోలీస్‌ స్టేషన్లో నాపై కేసు పెట్టారు. నేను ఆంధ్ర యూనివర్సిటీ పరువు తీశానంటున్నారు. విశ్వవిద్యాలయం గ్రౌండ్‌లో కట్టలుగా నిరోధ్‌లు దొరికాయి. దాన్ని నేను ప్రస్తావిస్తే సీఎం, విజయసాయిరెడ్డి లాంటివాళ్లు దానిపై విచారణ చేసి వాస్తవాలు బయటపెట్టాలి. అలా చేయకుండా నాపై కేసులు పెట్టడం మూర్ఖత్వం’ అని అయ్యన్నపాత్రుడు అన్నారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజులా తననూ కొట్టించాలన్నది వైకాపా నాయకుల ఆలోచన అని ఆయన ఆరోపించారు. ‘నా మీద…

Read More

‘ఈ నాయకులకో దండం.. అవసరమైతే ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ అధ్యక్షుడు బి.గిరిబాబు వైకాపా ప్లీనరీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలోని జీఎంఈ కాలనీలో గురువారం నియోజకవర్గ స్థాయి వైకాపా ప్లీనరీని మంత్రి సీదిరి అప్పలరాజు అధ్యక్షతన నిర్వహించారు. వేదికపై మంత్రితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాసు, జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ, డీసీసీబీ ఛైర్మన్‌ రాజేశ్వరరావు, పార్టీ సీనియర్‌ నాయకుడు హెచ్‌.వెంకటరావు ఆశీనులయ్యారు. అతిథులను మాత్రమే వేదికపైకి పిలిచామని మిగిలిన వారంతా దిగువన కూర్చోవాలని ఆహ్వానం పలికిన పార్టీ పలాస మండల అధ్యక్షుడు పైల వెంకటరావు పేర్కొన్నారు. దీంతో మున్సిపల్‌ ఛైర్మన్‌ బి.గిరిబాబు కార్యకర్తల మధ్యలో కూర్చున్నారు. కొద్ది సేపటి తర్వాత గిరిబాబు వేదిక పైకి వచ్చి మాట్లాడాలని పైల వెంకటరావు పలు మార్లు పిలిచినా ఆయన…

Read More

హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లా గుడాటిపల్లి గ్రామానికి చెందిన గౌరవెల్లి భూ నిర్వాసితులు బద్దం శంకర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులకు పోలీసులు బేడీలు వేయటం దారుణమని తెలంగాణ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం రైతులు భూమి ఇస్తే వారికి బేడీలు వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం, తెరాస ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని ఘాటుగా విమర్శించారు. సీఎం కేసీఆర్‌ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Read More

హైదరాబాద్‌: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాను కలిసేందుకు తాము సిద్ధంగా లేమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెరాస అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు వస్తున్న ఆయన్ను కలిసేది లేదని కుండబద్దలు కొట్టారు. తమను కలిసేందుకు వచ్చి కేసీఆర్‌ను కలవాలనుకున్నా… కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చి తమను కలవాలన్నా తాము కలిసేది ఉండదని స్పష్టం చేశారు. యశ్వంత్‌ సిన్హా టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని మమతా బెనర్జీ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు కోరారు. మద్దతిచ్చాం… ఎన్నికల్లో ఓట్లు వేస్తామని వివరించారు. ‘‘చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నాకు మంచి మిత్రుడు. పార్టీ మారుతున్నట్టు ఒకమాట అయినా చెబుతారని అనుకున్నా. కానీ, చెప్పలేదు. అయినా… ఆయనపై స్పందించేది ఏముంది? భాజపాలో చేరిన కొద్ది కాలానికే విశ్వేశ్వరరెడ్డి తిరిగి బయటకు వస్తారని భావిస్తున్నా’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Read More

హైదరాబాద్‌: జులై 2, 3 తేదీల్లో జరగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య నగరంలోని అంబర్‌పేట్‌ నియోజకవర్గంలో గురువారం విస్తృత పర్యటన చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సంబంధించి భాజపా అధిష్టానం కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ముందుగా అంబర్ పేటకు చేరుకొని విస్తృతంగా పర్యటించారు. మౌర్య పర్యటనల సందర్భంగా నియోజకవర్గంలోని అశోక్ ఫంక్షన్ హాల్‌లో భాజపా యువ మోర్చా, మహిళా మోర్చా సమావేశాలను నిర్వహించారు. బర్కత్‌పురాలోని నగర కార్యాలయంలో అంబర్‌పేట నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు, బూత్‌ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య మాట్లాడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కన్నె ఉమా రమేశ్ యాదవ్, బి.పద్మ వెంకట్ రెడ్డి, అమృత, పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. బాగ్ అంబర్‌పేట్‌ డివిజన్‌లోని…

Read More

దిల్లీ: అధికార పీఠాన్ని కోల్పోయిన శివసేనకు మునుముందు మరిన్ని అగ్నిపరీక్షలు తప్పేలా లేవు! రాజకీయంగా ఆ పార్టీ కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన 56 ఏళ్ల చరిత్రలో శివసేన చాలా తిరుగుబాట్లు చూసింది. వాటివల్ల ఛగన్‌ భుజ్‌బల్‌, నారాయణ్‌ రాణే, రాజ్‌ ఠాక్రే వంటి కీలక నేతలు పార్టీని వీడారు. కానీ శిందే బృందం కొట్టిన దెబ్బ చాలా గట్టిది. తాజా తిరుగుబాటుతో ఏకంగా ఉద్ధవ్‌ సర్కారు కూలిపోయింది. ఇకపై సీఎంగా శిందే మరింత మంది శివసైనికులను తన వైపు లాక్కొని.. శివసేనను బలహీనపర్చే అవకాశముంది. పార్టీకి గట్టి పట్టుండే ఠాణే, కొంకణ్‌, మరాఠ్వాడా ప్రాంతాల్లో ప్రస్తుత చీలికతో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయిందని మహా వికాస్‌ ఆఘాడీ (ఎంవీయే) నేత ఒకరు చెప్పుకొచ్చారు. గతంలో భుజ్‌బల్‌, నారాయణ్‌ రాణే తిరుగుబాటు చేసినప్పుడు మహారాష్ట్రలో శివసైనికులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. తదుపరి ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతలు ఓడిపోయేలా…

Read More