‘ఈ నాయకులకో దండం.. అవసరమైతే ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ అధ్యక్షుడు బి.గిరిబాబు వైకాపా ప్లీనరీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలోని జీఎంఈ కాలనీలో గురువారం నియోజకవర్గ స్థాయి వైకాపా ప్లీనరీని మంత్రి సీదిరి అప్పలరాజు అధ్యక్షతన నిర్వహించారు. వేదికపై మంత్రితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాసు, జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ, డీసీసీబీ ఛైర్మన్ రాజేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకుడు హెచ్.వెంకటరావు ఆశీనులయ్యారు. అతిథులను మాత్రమే వేదికపైకి పిలిచామని మిగిలిన వారంతా దిగువన కూర్చోవాలని ఆహ్వానం పలికిన పార్టీ పలాస మండల అధ్యక్షుడు పైల వెంకటరావు పేర్కొన్నారు. దీంతో మున్సిపల్ ఛైర్మన్ బి.గిరిబాబు కార్యకర్తల మధ్యలో కూర్చున్నారు. కొద్ది సేపటి తర్వాత గిరిబాబు వేదిక పైకి వచ్చి మాట్లాడాలని పైల వెంకటరావు పలు మార్లు పిలిచినా ఆయన వెళ్లలేదు. పార్టీ సీనియర్ నాయకుడు హెచ్.వెంకటరావు ఆయన వద్దకు వచ్చి పిలిచారు. ‘సమావేశం ఎవరు నిర్వహిస్తున్నారు.. ఎజెండా ఏమిటి.. వేదికపైకి పిలవకుండా నన్ను ఎందుకు అవమానించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కనీస గౌరవం ఇవ్వడం లేదు.. ఈ పదవులు నాకొద్దు.. అవసరమైతే ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తాను’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆయనతో పాటు అనుచరులు సైతం వెళ్లిపోయారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!