Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
Author: admin
ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ANDHRAPATRIKA : – 14-11-2024 న ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయవాడ అర్బన్ ఎంఈఓ బి సోమశేఖర్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. పాఠశాల లోని గ్రీన్ హౌస్ ప్రాతినిధ్యంతో బాలలకు రకరకాల పూల రంగోలి పోటీలు, కుకింగ్ వితౌట్ గ్యాస్, మెహందీ పోటీలు నిర్వహించారు. అన్ని రంగాలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా మెడల్స్ బహూకరించారు. పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి కుమారి గారు పిల్లల్ని ఉద్దేశిస్తూ పిల్లలు అని రంగాలలో ఉత్సాహం చూపించాలని, చదువులో ముందంజ వేయాలని పిల్లలకి ఉపదేశించారు. ముఖ్యఅతిథి అయిన బి. సోమశేఖర్ గారు మాట్లాడుతూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ యొక్క గొప్పతనాన్ని ,ఆయన పుట్టినరోజు నాడు బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము అనే విషయాన్ని, బాలల దినోత్సవ ప్రాముఖ్యతని పిల్లలకు…
ప్రధాన అతిథి: S. దుర్గాదేవి, పటమట పోలీస్ స్టేషన్ ఎస్.ఐ స్కూల్ ప్రిన్సిపల్: పద్మవాణి ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ప్రత్యేకంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో **స్కూల్ ప్రిన్సిపల్ ప్రియమైన పద్మవాణి గారు ఉపన్యాసం ఇచ్చారు, పిల్లలకు ప్రేరణాత్మకమైన మాటలు చెప్పారు మరియు బాల్యానికి ఎంత ముఖ్యమైనదో, తమ స్వప్నాలను సాకారం చేసుకోవడంలో వారంతా దృఢమైన కోరికతో ముందడుగు వేయాలని అభిలషించారు.ఈ సందర్భంగా S. దుర్గాదేవి, పటమటా పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆమె తన ప్రసంగంలో పిల్లలకు సెక్యూరిటీ, సమాజ సేవ మరియు విలువైన పాఠాలు నేర్పుతూ, మంచి పౌరులుగా ఎదగాలని, ప్రతి ఒక్కరికీ గౌరవం మరియు బాధ్యత ఉన్నదని చెప్పారు.త్రివేణి గారి యెల్లో హౌస్ అడ్వర్యంలో ఇంచార్గ్ లు అందరు కలిసి ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఈ సందర్భాన్ని మరింత ఉత్సాహంగా జరుపుకుంటూ వివిధ ఆటలు, క్రీడలు, నృత్య ప్రదర్శనలు మరియు పాటలతో…
AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ANDHRAPATRIKA : – అమరావతి, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలు సోమవారం (నవంబర్ 4) విడుదలకానున్నాయి. ఈ రోజు మంత్రి నారా లోకేశ్ విడుదల చేయనున్నారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2వ తేదీన ఫలితాలు వెల్లడి కావాల్సిఉండగా.. తుది కీ విడుదలలో జాప్యం చోటు చేసుకోవడం వల్ల ఫలితాల వెల్లడి వాయిదా పడింది. ఈ మేరకు సోమవారం టెట్ ఫలితాల వెల్లడికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రెస్పాన్స్ షీట్లు, ఫైనల్ కీ వెల్లడైన విషయం తెలిసిందే. కాగా ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు మొత్తం 17 రోజుల పాటు నిర్వహించారు. టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,68,661 మంది అంటే 86.28% మంది పరీక్షలకు…
AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే! ANDHRAPATRIKA : – అమరావతి, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ (DSC Notification) మరో రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేయనుంది. ఇప్పటికే నవంబరు 6వ తేదీన ఉద్యోగ ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ ప్రటకన విడుదల చేసింది. ఆ లోపు ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) పోస్టులు 7725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు 1781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు (పీఈటీ)…
Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం.. ANDHRAPATRIKA : – కార్తీక మాసం శుక్ల పక్ష శుద్ధ చవితి తిధిని నాగుల చవితి పండగగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు పాము పుట్టలో పాలు పోస్తారు. తమని తమ సంతానాన్ని చల్లగా చూడమంటూ నాగదేవతను వేడుకుంటారు. ఈ నెల 5వ తేదీ మంగళవారంన అంటే రేపు నాగుల చవితి పర్వదినం సందర్భంగా తిరుమలలో ఘనంగా వేడుకలను నిర్వహించనున్నారు. శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటలవరకు దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే స్వామివారి బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ప్రసాదించాడు.…
AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు.. ANDHRAPATRIKA : – నంద్యాల జిల్లా డోన్‌లో ఘరానా మోసం చోటుచేసుకుంది. రామాంజనేయులు అనే మోసగాడు క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లకు పైగా ప్రజల నుంచి వసూలు చేసి మోసం చేశాడు. కర్నూలు, నంద్యాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 300 పైగా బాధితులు ఉన్నారు. ఈ మోసగాన్ని 45 రోజులుగా డోన్ పోలీసులు విచారణ పేరుతో నిందితుడిని తమ అదుపులో ఉంచుకొని విచారణ చేసిన ఎలాంటి పురోగతి లేకపోవడంతో తాము పెట్టుబడులు పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయా లేదా అంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు. రామాంజనేయులు డోన్‌లో 2021 నుండి కేవలం ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో ప్రజలకు పరిచయమై అందరిని నమ్మించిన కేటుగాడు, కర్నూలు, నంద్యాల, మహబూబ్‌నగర్ జిల్లాలోని 300 మందికి పైగా బాధితులు ఉన్నట్లు సమాచారం. గతంలో అనంతపురంలో రూ.90 లక్షలకు పైగా ప్రజల…
Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? ANDHRAPATRIKA : – విజయవాడ, నవంబర్ 4: ఓ మహిళ రన్నింగ్ ట్రైన్‌లో నుంచి అమాంతం కింద ఉన్న కాలువలోకి దూకేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. అనంతరం ఆమె నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. కొంత దూరం వెళ్లాక ఓ చెట్టు కొమ్మ ఆసరాగా చేసుకుని దాదాపు 10 గంటలపాటు నీళ్లలోనే నానా తంటాలు పడింది. ఈ షాకింగ్ ఘటన విజయవాడలోని కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో షేక్ ఖాదర్‌వలి కుటుంబంతో కలిసి నిజాంపట్నంలో నివాసం ఉంటున్నారు. ఆయన ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య జిన్న తున్నీసా (47) గత కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతుంది. సుదీర్ఘకాలంగా మందులు వాడుతున్నప్పటికీ ఆమెలో గుణం కనిపించడం లేదు. మందుల…
సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు! ANDHRAPATRIKA : – – సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సెక్యూరిటీ గార్డు డాక్టర్ అవతారం ఎత్తాడు. దీంతో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం తీవ్ర అస్తవ్యస్తంగా మారిన దృశ్యం స్పష్టమవుతోంది. తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తి చికిత్స నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. కానీ వైద్యుడికి బదులు యూనిఫాం ధరించిన సెక్యూరిటీ గార్డు పేషెంట్ కాలికి కట్టు కట్టాడు. అంతేకాదు సదరు సెక్యూరిటీ గార్డు రోగికి ఇంజక్షన్ కూడా ఇచ్చాడు. ఈ భయానక వీడియో బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నుండి బయటకు వచ్చింది. వైరల్ వీడియోలో, ఆరోగ్య కేంద్రంలో తీవ్ర అస్తవ్యస్తత చిత్రాలు చిక్కుకున్నాయి. సెక్యూరిటీ గార్డు వైద్యుడికి బదులు రోగికి ఇంజెక్షన్ ఇచ్చాడు. ముజఫర్‌పూర్‌లోని ముసహ్రీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన…
ANDHRAPATRIKA : – ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్… చెన్నైలో కూడా వర్క్ చేస్తుందా…? అంటే మాజీ మంత్రి కొడాలి నానీకి ఎర్త్ పెట్టేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిందా…? అవుననే సమాధానం వినపడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన వాళ్ళల్లో కొడాలి నానీ ఒకరు. వైఎస్ జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు చేసినా చేయకపోయినా సరే నానీ పదే పదే మీడియా ముందుకు వచ్చి ఘాటు విమర్శలు చేసే వాళ్ళు. ఆయన వ్యాఖ్యల్లో విమర్శల కంటే బూతులే ఎక్కువగా ఉండేవి. ఈ విమర్శలపై వైసీపీ నేతలు కూడా షాక్ అయ్యేవారు. జగన్ ను విమర్శించే వాళ్ళనే కాదు… టీడీపీని పొగిడిన వాళ్ళపై కూడా కొడాలి నానీ విమర్శలు చేసేవాళ్ళు. వెనుకా ముందు చూడకుండా ఆయన ఒంటి కాలుపై లేచిన సందర్భాలు ఎన్నో. ఆయన విమర్శలకు మీడియా కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. టీడీపీని తిట్టాల్సిన ప్రతీసారి……
Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..! ANDHRAPATRIKA : – -లోన్ యాప్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులకు మోసాల వల వేస్తున్నారు. బాధితులు ఈ యాప్‌ల ను ఇన్‌స్టాల్ చేసుకోవడంతో, వారి ఫోన్లపై నేరస్తులు నియంత్రణ పొందుతారు. ఎలాంటి డాక్యుమెంట్‌లు లేకుండా చిన్న మొత్తంలో రుణాలు ఇస్తారు, కానీ తర్వాత బాధితుల ఫోటోలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. కేవలం రెండు వేల నుండి అయిదు వేల రూపాయల వరకు అప్పుగా ఇచ్చి, ఆ తర్వాత లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వకుంటే బాధితుల మార్పిడి ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తామని లేదా వాళ్ల పరిచయస్తులకి పంపుతామని బెదిరింపులకు పాల్పడుతారు. వారి బ్లాక్‌మెయిల్‌కు లొంగిపోయి బాధితులు వేలు, లక్షల్లో డబ్బులు పోగొట్టుకోవడమో లేదా అవమానంగా భావించి ఆత్మహత్యలకు పాల్పడడమో చేస్తున్నారు. ఇటీవల ఈ తరహా…