ముఖ్యంగా జొమాటో, స్విగ్గీ సంస్థలను భారతదేశంలో ఎక్కువ మంది యువత ఇష్టపడుతున్నారు. అయితే వీటిల్లో ఫుడ్ ఆర్డర్ పెడితే చెల్లింపులను మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ లేదా ఇతర థర్డ్ పార్టీ యాప్స్ అయిన ఫోన్ పే, గూగుల్ పే అమెజాన్ వంటి సంస్థల ద్వారా చేయాల్సి వచ్చేది. అయితే తాజాగా ఈ చెల్లింపుల విషయంలో ఆర్బీఐ జొమాటోకు గుడ్ న్యూస్ చెప్పింది. జొమాటో తన అనుబంధ సంస్థ జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్‌ను మంజూరు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ మన అవసరాలకు తగినట్లు కొత్త సదుపాయాలను మన ముందుకు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఫుడ్ డెలివరీ యాప్‌లు అత్యంత ప్రజాదరణను పొందాయి. ముఖ్యంగా జొమాటో, స్విగ్గీ సంస్థలను భారతదేశంలో ఎక్కువ మంది యువత ఇష్టపడుతున్నారు. అయితే వీటిల్లో ఫుడ్ ఆర్డర్ పెడితే చెల్లింపులను మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ లేదా ఇతర థర్డ్ పార్టీ యాప్స్ అయిన ఫోన్ పే, గూగుల్ పే అమెజాన్ వంటి సంస్థల ద్వారా చేయాల్సి వచ్చేది. అయితే తాజాగా ఈ చెల్లింపుల విషయంలో ఆర్బీఐ జొమాటోకు గుడ్ న్యూస్ చెప్పింది. జొమాటో తన అనుబంధ సంస్థ జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్‌ను మంజూరు చేసింది. ఇటీవల జొమాటో ఆర్బీఐ ఆమోద విషయాన్ని తెలిపింది. జొమాటో సంస్థ తన ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ-కామర్స్లావాదేవీలను సులభతరం చేయడానికి అనుమతిస్తుంది. ఈ తాజా అప్డేట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆగస్టు 4, 2021న జొమాటో ప్రైవేట్‌కు సంబంధించిన పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ అయిన జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన విలీనానికి చెల్లింపు అగ్రిగేటర్, ప్రీ-ఇష్యూజర్గా చెల్లింపు విషయంలో అనుమతులు కోరింది. జెడ్పీపీఎల్ భారతదేశంలో చెల్లింపు అగ్రిగేటర్‌గా పనిచేయడానికి ఆర్బీఐ నుంచి జనవరి 24, 2024 ధ్రువీకరణను మంజూరు చేసింది. ఈ విషయాన్ని జొమాటో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దీని వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం.
చెల్లింపు అగ్రిగేటర్‌గా, ప్రీ-పెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ల జారీదారుగా వ్యాపారాన్ని నిర్వహించడానికి జోమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జెడ్పీపీఎల్) అనే పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థను జోమాటో ఆగస్టు 2021లో వెల్లడించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తర్వాత జొమాటో చెల్లింపులు దాని ప్లాట్‌ఫారమ్ ద్వారా ఇ-కామర్స్ లావాదేవీలను సులభతరం చేస్తాయి.
అధికారీకరణ తర్వాత ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా పనిచేయడానికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లైసెన్స్‌ను పొందడానికి జొమాటో టాటా పే, రేజర్‌పే లీగ్‌లో చేరింది .
గత సంవత్సరం ఫుడ్ అగ్రిగేటర్ దాని సొంత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆఫర్‌ను ప్రారంభించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది
లావాదేవీలను సులభతరం చేయడం కోసం గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి థర్డ్-పార్టీ చెల్లింపు యాప్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇతర యాప్‌లు చేసే చెల్లింపులతో వచ్చే వ్యాపారి ఛార్జీలను ఆదా చేయడం ఈ చర్య లక్ష్యం.