నవంబర్ 09 (ఆంధ్రపత్రిక): ఇండియా స్టార్ బాక్సర్, హైదరాబాదీ నిఖత్ జరీన్ కల నిజమైంది. తాను ఎంతగానో అభిమానించే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఎట్టకేలకు కలుసుకుంది. అంతేకాదు ఖాన్‌తో కలిసి స్టెప్పులు వేసింది.ముంబైలో సల్మాన్ కొత్త చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా సెట్‌కు వెళ్లిన నిఖత్.. 1991లో వచ్చిన ’లవ్’ సినిమాలో ’సాథియా యే తునే క్యా కియా’ అనే పాటకు ఆయనతో అందంగా డ్యాన్స్ చేసింది. వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసిన జరీన్.. ’ఎట్టకేలకు నా నిరీక్షణ ముగిసింది. నా కల నిజమైంది’ అని పేర్కొంది. నిఖత్‌కు చిన్నప్పటి నుంచి సల్మాన్ అంటే చాలా ఇష్టం. తను వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ నెగ్గినప్పుడు అభినందిస్తూ సల్మాన్ ట్వీట్ చేశారు. తన గురించి సల్మాన్ ట్వీట్ చేశాడంటే నమ్మలేపోతున్నానని జరీన్? చెప్పింది. ఒక్కసారైనా సల్మాన్‌ను కలుసుకోవాలని ఉందని తెలిపింది. ఇప్పుడు ఆ అవకాశం ఆమెకు వచ్చింది. చెల్లి అఫ్నాన్?తో కలిసి వచ్చిన నిఖత్?ను ఆప్యాయంగా పలుకరించిన సల్మాన్? వారితో సెల్ఫీ దిగారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!