నవంబర్ 02 (ఆంధ్రపత్రిక): కమల్‌హాసన్ కథానాయకుడిగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ’భారతీయుడు`2’ 1996లో ఈ ఇద్దరి కలయికలోనే వచ్చిన ’భారతీయుడు’ చిత్రానికి కొనసాగింపుగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 2020లో వివిధ కారణాలతో ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల చెన్నైలో తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ నటిస్తున్నారు. తాజాగా యోగ్ రాజ్ షూటింగ్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని యోగ్రాజ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు మేకప్ వేసుకుంటున్న ఫొటోను షేర్ చేశారు. తనకు మేకప్ వేసిన మేకప్ మెన్‌కు థ్యాంక్స్ చెప్పారు. కమల్‌హాసన్ సైతం భారతీయుడు`2 సినిమాలో నటించేందుకు పంజాబ్ సింహం సిద్ధంగా ఉందంటూ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ విూడియాలో వైరల్ అవుతోంది. ’భారతీయుడు`2’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!