తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఆయా పొలిటికల్ పార్టీల సమీకరణాలు రోజుకు రోజుకు మారిపోతున్నాయి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ భవితవ్యం త్వరలో ఖరారు కానుంది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియ తుదిదశకు చేరినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షర్మిల మరోసారి హస్తిన పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. షర్మిల తన భర్త అనిల్‌తో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఈసారి పర్యటనలో ఆమె తన వెంట గన్‌మెన్‌ను కూడా తీసుకురాలేదు. గతంలోనూ..
ఇప్పుడు తెలంగాణలో వైఎస్సార్టీపీ గురించే చర్చ నడుస్తోంది. ఎంత వీలైతే అంత తొందరగా వైఎస్ షర్మిల పార్టీని… కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు తెర వెనక రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఆయా పొలిటికల్ పార్టీల సమీకరణాలు రోజుకు రోజుకు మారిపోతున్నాయి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ భవితవ్యం త్వరలో ఖరారు కానుంది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియ తుదిదశకు చేరినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షర్మిల మరోసారి హస్తిన పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. షర్మిల తన భర్త అనిల్‌తో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఈసారి పర్యటనలో ఆమె తన వెంట గన్‌మెన్‌ను కూడా తీసుకురాలేదు. గతంలోనూ తన పర్యటన వివరాలు బయట ఎవరికీ తెలీకుండా గోప్యతను పాటించిన షర్మిల ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్న షర్మిల, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు సాగించారు. పార్టీవిలీనానికి అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా సానుకూలంగానే ఉంది. అయితే తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాత్రం షర్మిల చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనేక సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా షర్మిల చేరిక పట్ల అయిష్టతను వ్యక్తపరిచాయి. అయితే షర్మిల తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో సాన్నిహిత్యం కల్గిన కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్టీపీ విలీనం ప్రక్రియ పూర్తయ్యేవరకు మీడియా కంటపడకుండా ఉండాలని షర్మిల భావిస్తున్నట్టు తెలిసింది.
అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ కసరత్తు..
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారపర్వంలో నాలుగు అడుగులు ముందే ఉన్న బీఆర్ఎస్ను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. టికెట్ల కోసం అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. కొద్దిరోజుల్లో తొలి జాబితా విడుదల చేసేందుకు కూడా రాష్ట్ర నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఇక ఆలస్యం చేస్తే తన పార్టీ విలీనం చేసినా ఉపయోగం ఉండదని షర్మిల భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే అధిష్టానం పెద్దలతో మరోసారి సమావేశమై, విలీనంపై ఏదో ఒకటి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.విలీనం కుదరకపోతే ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు పొత్తులైనా పెట్టుకోవాలని గతంలోనే ప్రతిపాదించినట్టు వార్తలొచ్చాయి. పొత్తులు పెట్టుకోవాలన్నా సరే.. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఉండాల్సిందే. అందుకే ఆమె ఢిల్లీ పర్యటన చేపట్టారని.. విలీనమా.. పొత్తా అన్న అంశంపై ఒకట్రెండు రోజుల్లోనే స్పష్టత వస్తుందని వైఎస్సార్టీపీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.