శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. అవినీతికి తావు లేకుండా బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగన్ ప్రభుత్వానిదేనని వైసీపీ ప్రజాప్రతినిధులు చెప్పారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగింది.
శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. అవినీతికి తావు లేకుండా బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగన్ ప్రభుత్వానిదేనని వైసీపీ ప్రజాప్రతినిధులు చెప్పారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగింది. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరిగింది. మడకశిర వైఎస్సార్ సర్కిల్లో బహిరంగ సభలో వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ ప్రసంగాల్లో బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ ప్రభుత్వం చేసిన మేలును వివరించారు.
సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని చెప్పారు వైసీపీ ఎంపీ నందిగాం సురేశ్. జగన్ రాకముందు పరిస్థితులు.. వచ్చాక జరిగిన మార్పులను ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారాయన. అవినీతికి తావు లేకుండా జగన్ ప్రభుత్వం డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. మడకశిర నియోజకవర్గం ప్రజలకు ఎప్పటికీ ప్రజలకు గుర్తిండిపోయే పనులు జగన్ చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి చెప్పారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ 2024లో జగన్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29 వరకూ మొత్తం 33 చోట్ల మూడో విడత సాధికార యాత్ర జరగనుంది