కేంద్రాన్ని నిలదీయడంలో పూర్తిగా విఫలం
వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు
ఎంపి రామ్మోహన్ నాయుడు
న్యూఢల్లీి, ఫిబ్రవరి 13 : పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదని టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అజెండాలో ప్రత్యేక హోదా అంశం పెడితే వైసీపీ తమ గొప్పతనం అన్నట్టు హంగామా చేశారన్నారు. గంటల వ్యవధిలో కేంద్రం హోదాను అజెండా నుంచి తీసేసిందని తెలిపారు. వైసీపీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్ళు అనే సిద్దాం తంతో టీడీపీ పనిచేస్తుందని టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. టిడిపి వచ్చిన తరవాతనే బడుగు,బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు దక్కాయన్నారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ జగన్పై ప్రజలకు మోజు తగ్గిందని, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమయ్యిందన్నారు. ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నవరత్నాలు సైతం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. పేదవాడు దౌర్భాగ్య పరిస్థితి అనుభవిస్తున్నాడని తెలిపారు. గ్రామ సచివాలయాలు సక్రమంగా పనిచేయటం లేదని, ప్రజలు తమ సమస్యలపై టీడీపీని ఆశ్రయి స్తున్నట్లు చెప్పారు. స్టాలిన్, కేసీఆర్, మమతలు కేంద్రంపై పోరాడుతున్నారన్నారు. జగన్ ఎందుకు మాట్లాడలేక పోతున్నారని నిలదీశారు. జగన్ పులకేసి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలకు టీడీపీ సిద్ధంగా ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.