భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ అన్నారు. బాధితులకు రేషన్తో పాటు నగదు సాయం కూడా అందిస్తామని అన్నారు. విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ప్రజలను కోరారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించారు.
భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ అన్నారు. బాధితులకు రేషన్తో పాటు నగదు సాయం కూడా అందిస్తామని అన్నారు. విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ప్రజలను కోరారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి.. తుపాను వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికీ తిరిగి రూ.2,500 ఇస్తారని వెల్లడించారు.
పంట నష్టపోయిన వారు బాధపడాల్సిన పనిలేదని, ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలు మరో వారం రోజుల్లో మొదలవుతాయని.. వీటిని జిల్లా కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తారని అన్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించారని సీఎం జగన్ అన్నారు. వీలైనంత వేగంగా విద్యుత్ సరఫరా సజావుగా జరిగేలా చూసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. తిరుపతి జిల్లాతో పాటు బాపట్ల జిల్లాలోనూ పంట నష్టపోయిన రైతులను సీఎం జగన్ పరామర్శించారు. రోడ్లను బాగు చేసే కార్యక్రమాలు కూడా చేపడతామని సీఎం జగన్ తెలిపారు.