మచిలీపట్నంసెప్టెంబర్ 3 ఆంధ్ర పత్రిక.:
నరసప్ప చెరువు ప్రాంత ప్రజలు, ఇంతేరు వాసులు వేదవ్యాస్ గతంలో చేసిన సేవలు మననం చేసుకుని మళ్లీ మీరే రావాలి సారు అంటూ ఆప్యాయంగా స్వాగతం పలికారు.
మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన మీరు మళ్ళీ రావాలి.. మీకోసం మేము ఎదురు చూస్తున్నాము సారూ….
అని నరసప్ప చెరువు, ఇంతేరు గ్రామ ప్రజలు బూరగడ్డ వేదవ్యాస్ ను అభ్యర్థించారు. ఆదివారం నాడు పెడన మండలం నరసప్ప చెరువు గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇంతేరు ప్రజలు , నరస ప్ప చెరువు వాసులు వేదవ్యాస్ ను కలిశారు. వీరంతా యువకులు కావడం గమనార్హం. ఈ సందర్బంగా వేద వ్యాస్ శాసన సభ్యునిగా ఉండగా చేసిన అభివృద్ధి ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. కృత్తివెన్ను మండలంలో అయన జరిపిన అభివృద్ధి మరచిపోలేమన్నారు. మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా వస్తే చూడాలని ఉందని ఇంతేరు గ్రామస్థులు ఆకాంక్షించారు. తనపట్ల వారు చూపిన అభిమానానికి వ్యాస్ కృతజ్ఞతలు చెప్పారు.ఈసందర్బంగా ఇంతేరు గ్రామస్థులు వ్యాస్ తో ఫోటోలు దిగారు.ఈ కార్యక్రమంలో గూడూరు మండలం మాజీ జడ్పీటీసీ బూరగడ్డ శ్రీకుమార్ అడపాల లక్ష్మణ స్వామి తదితరులు పాల్గొన్నారు.