డిసెంబర్ 06 (ఆంధ్రపత్రిక): టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ’యశోద’. అద్దె గర్భం అనే విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం.. నవంబర్ 11న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. హరి`హరీష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రూ.30 కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టి సత్తా చాటింది. ముఖ్యంగా ఈ సినిమాలో సమంత నటనకు అభిమానులతో పాటు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. అయితే.. థియేటర్స్‌లో ఈ సినిమాని చూడలేకపోయిన ఎంతోమంది సినీ లవర్స్ ఈ చిత్ర ఓటీటీ విడుదల గురించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సింది. కానీ ’ఈవా’ హాస్పిటల్స్ కేసు వేయడంతో విడుదలని నిలిపి వేశారు. తాజాగా దీనికి సంబంధించిన వివాదం సద్దు మణిగింది. దీంతో ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ ఉన్న అడ్డు తొలగింది. దాంతో ఈ నెల 9న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్టీమ్రింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఆ ఓటీటీ యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రానుంది. కాగా.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూనే ఈ చిత్రానికి సమంత డబ్బింగ్ కంప్లీట్ చేయడం విశేషం.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!