గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పనుల కొనసాగింపు
ఏరియల్ సర్వే ద్వారా పనుల పురోగతి పరిశీలన
త్వరగా పనులు పూర్తి చేయాలన్న సిఎం కెసిఆర్
నల్లగొండ,నవంబర్ 28 (ఆంధ్రపత్రిక): నేషనల్ గ్రీన్ ట్రిబ్యులన్ సూచనల మేరకు పవర్ ప్లాంట్ పనులు కొన సాగాలని సిఎ కెసిఆర్ సూచించారు. ఎక్కడా పర్యావరణానికి విఘాతం లేకుండా చూడాలన్నారు. యాదాద్రి అల్టా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పనుల పురోగతిని పరిశీ లించారు. నిర్మాణ పనుల వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఫస్ట్ స్టేజ్ యూనిట్ 2లో బాయి లర్ నిర్మా ణంలో 82 మీటర్ల ఎత్తులోని 12వ ప్లోర్లో జరుగుతున్న పనులను సీఎం నిశితంగా పరిశీలించారు. 2023, డిసెంబర్ చివరి నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రానికి వెలుగులు పంచాలని జెన్కోకు సూచించారు. పనులను వేగవంతం చేయా లన్నారు. 2015లో ఈ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభం కాగా, ఇప్పటికే ప్లాంట్‌లో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా మూడు యూనిట్లు 70 శాతం వరకు అయ్యాయి. 5 వేల ఎకరాల్లో రూ.29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో 5 పవర్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ముఖ్య మంత్రితో పాటు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, శానం పూడి సైదిరెడ్డి, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, తదితరులు ఉన్నారు.