WTC 2023 Final, Virat Kohli Records: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అందరి చూపు విరాట్ కోహ్లీపైనే ఉంటుంది. టైటిల్ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీకి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ బుధవారం, జూన్ 7నుంచి మొదలుకానుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్‌లో అందరి చూపు విరాట్ కోహ్లీపైనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ ఎన్నో భారీ రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.
సర్ డాన్ బ్రాడ్‌మన్‌ను వెనక్కి నెట్టే ఛాన్స్..
టెస్టు క్రికెట్లో సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట 29 సెంచరీలు ఉన్నాయి. కింగ్ కోహ్లి ఈ ఫార్మాట్లో 28 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో కింగ్ కోహ్లి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పైనల్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధిస్తే.. డాన్ బ్రాడ్‌మన్‌ను వెనక్కి నెట్టేస్తాడు. ఆఖరి మ్యాచ్‌లో కోహ్లి ఒక సెంచరీ సాధిస్తే బ్రాడ్‌మన్ సెంచరీలతో సమానంగా నిలుస్తాడు.
సచిన్, పాంటింగ్‌లను వెనక్కి నెట్టనున్న విరాట్ కోహ్లి..
బ్రాడ్‌మన్‌తో పాటు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్‌లను కూడా కింగ్ కోహ్లీ వెనక్కునెట్టే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విరాట్ 112 పరుగులు చేస్తే.. సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్‌ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేస్తాడు.
ప్రస్తుతం ఐసీసీ టోర్నీలో నాకౌట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉంది. నాకౌట్ మ్యాచ్‌లలో పాంటింగ్ 18 ఇన్నింగ్స్‌లలో 731 పరుగులు చేశాడు. ఈ రికార్డు జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరు రెండో స్థానంలో నిలిచింది. ఐసీసీ నాకౌట్లో సచిన్ 14 ఇన్నింగ్స్‌ల్లో 658 పరుగులు చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ – రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.