Indian cricket Team’s new Jerseys: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023కి ముందు, టీమిండియా కొత్త జెర్సీని అడిడాస్ విడుదల చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు తొలిసారిగా ఈ జెర్సీని ధరించి, బరిలోకి దిగనుంది. జూన్ 7 నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే.
జూన్ 7 నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ముందు, అడిడాస్ ఇండియా టీమ్ ఇండియా కొత్త జెర్సీలను విడుదల చేసింది. ఇటీవల, అడిడాస్ భారత క్రికెట్ జట్టుకు కొత్త కిట్ స్పాన్సర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈమేరకు కొత్త జెర్సీలను గురువారం సాయంత్రం విడుదల చేసింది. టెస్ట్, వన్డే, టీ20 ఇంటర్నేషనల్ అనే మూడు ఫార్మాట్ల కోసం కొత్త జెర్సీలను విడుదల చేసింది.
కొత్త జెర్సీని విడుదల చేసిన వీడియోను అడిడాస్ ఇండియా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ మేరకు ‘ఇది ఐకానిక్ మూమెంట్. ఒక ఐకానిక్ స్టేడియం. కొత్త టీమ్ ఇండియా జెర్సీని పరిచయం చేస్తున్నాం’ అంటూ క్యాప్షన్ అందించింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియం నుంచి ఈ జెర్సీ బయటకు వస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ మైదానంలో భారత జట్టు 2011 వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది.
జూన్ 7 నుంచి జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు తొలిసారి కొత్త జెర్సీని ధరించనుంది. WTC 2023 ఫైనల్ మ్యాచ్ లండన్‌లోని ఓవల్‌లో జరుగుతుంది. ఈ జెర్సీకి ముందు, అడిడాస్ రూపొందించిన కొత్త కిట్‌లో టీమ్ ఇండియా ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. వన్డే, టీ20 ఇంటర్నేషనల్ కోసం వివిధ జెర్సీలు కూడా విడుదల చేశారు. రెండింటి రంగు నీలం అయినప్పటికీ, కొంత వ్యత్యాసం ఉంది. ఇక టెస్ట్ కోసం తెలుపు రంగు జెర్సీని విడుదల చేశారు.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా గత నెలలో కొత్త కిట్ స్పాన్సర్‌గా అడిడాస్ను ప్రకటించింది. BCCI విడుదల చేసిన ప్రకటనలో, “మార్చి 2028 వరకు ఈ కాంట్రాక్ట్ అడిడాస్ దక్కించుకుంది. అన్ని ఫార్మాట్లలో కిట్లను తయారు చేయడానికి అడిడాస్‌కు ప్రత్యేక హక్కులు ఉన్నాయి” పేర్కొంది. జూన్ 2023 నుంచి టీమిండియా జెర్సీపై అడిడాస్ సింబర్ అయిన మూడు చారలు కనిపించనున్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌లో కొత్త కిట్‌ను ప్రారంభించనుంది.