WTC Final 2023: ఎంతో రసవత్తరంగా రెండు నెలల పాటు జరిగిన ధనాధన్ లీగ్ ముగిసింది. పొట్టి క్రికెట్ నుంచి అసలైన క్రికెట్ నుంచి వచ్చే మజా ఏమిటో తెలియజేసేందుకు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ సిద్ధమైంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 7 నుంచి 5 రోజుల..
ఎంతో రసవత్తరంగా రెండు నెలల పాటు జరిగిన ధనాధన్ లీగ్ ముగిసింది. పొట్టి క్రికెట్ నుంచి అసలైన క్రికెట్ నుంచి వచ్చే మజా ఏమిటో తెలియజేసేందుకు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ సిద్ధమైంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 7 నుంచి 5 రోజుల పాటు జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్- ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ, క్రికెట్ అస్ట్రేలియా ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలో ప్రపంచ క్రికెట్ మాజీలు టీమిండియా, అసీస్ ప్లేయర్లపై అంచనాలు వేస్తుండగా కంగారుల మాజీ కెప్టెన్ రిక్కీ పాంటిగ్ చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ గురించి అసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రికీ పాంటింగ్ మాట్లాడుతూ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పుజారా టీమిండియాకు కీలకంగా మారతారని.. ఆస్ట్రేలియా దృష్టి మొత్తం ఈ ఇద్దరిపైనే ఉంటుందని, వారిని త్వరగా ఔట్ చేసే వ్యూహాలతో బరిలోకి అసీస్ టీమ్ వస్తుందని చెప్పుకొచ్చాడు. కోహ్లీ, పుజారాతో అస్ట్రేలియా టీమ్‌కి చివరి వరకు ప్రమాదం ఉంటుందని అభిప్రాయపడ్డాయి. అయితే రికీ పాంటింగ్ అలా చెప్పడానికి కారణాలు లేకపోలేదు. టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజరాకు ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డులు ఉన్నాయి. ఆసీస్‌తో పుజారా ఆడిన 24 మ్యాచ్‌ల్లో మొత్తం 2033 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు కూడా ఉండడం విశేషం.
అలాగే విరాట్ కోహ్లీకి కూడా అస్ట్రేలియాపై మంచి పట్టు ఉంది. ఇటీవలే ఐపీఎల్ క్రికెట్లో విధ్వంసకర బ్యాటింగ్ చేసిన కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు సహా మొత్తం 639 పరుగులు చేశాడు. ఇంకా ఇప్పటివరకు ఆసీస్‌తో 24 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 42 ఇన్నింగ్స్‌ల్లో 1979 పరుగులు చేశాడు. ఇందులో కోహ్లీ యావరేజ్ 48.26 కావడమే కాక అతని హైస్కోర్ 186 కావడం విశేషం. ఇంకా ఆసీస్‌పై కోహ్లీ ఖాతాలో 8 సెంచరీలు, 5 అర్థ శతకాలు కూడా ఉన్నాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్ జట్లు
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియాన్, జోష్ ఇంగ్లిస్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
భారత టెస్ట్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్
టీమిండియా స్టాండ్ బై ప్లేయర్లు: సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైశ్వాల్, ముకేశ్ కుమార్