ప్రపంచ వైద్య శాస్త్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ ప్రపంచంలోనే తొలిసారి రోబోటిక్ కాలేయ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. సౌదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌తో బాధపడుతోన్న రోగికి పూర్తిస్థాయిలో రోబోటిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతంగా జరిపినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) పేర్కొంది. సౌదీలోని రియాద్‌కు చెందిన కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్..
ప్రపంచ వైద్య శాస్త్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ ప్రపంచంలోనే తొలిసారి రోబోటిక్ కాలేయ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. సౌదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌తో బాధపడుతోన్న రోగికి పూర్తిస్థాయిలో రోబోటిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతంగా జరిపినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) పేర్కొంది.
సౌదీలోని రియాద్‌కు చెందిన కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (KFSH&RC)లో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (NASH), హెపాటోసెల్లర్ కార్సినోమా (HCC)తో బాధపడుతున్న 66 ఏళ్ల సౌదీ వ్యక్తికి బుధవారం (సెప్టెంబర్ 27) ఈ మేరకు రోబోటిక్ విధానంలో ఆపరేషన్ నిర్వహించింది. ఎలాంటి హైబ్రిడ్ విధానం అవసరం లేకుండానే అత్యాధునిక రోబో ద్వారా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం రోగి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయిఓటీసీఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ డైటర్ బ్రోరింగ్ మాట్లాడుతూ.. ‘తాజాగా నిర్వహించిన ఈ రిమార్కబుల్ ఆపరేషన్ ద్వారా వైద్య ఆవిష్కరణల సరిహద్దులను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచవ్యాప్తంగా రోగులకు అందించే ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను పెంచడానికి సహాయపడుతుంది. పూర్తిగా రోబోటిక్ విధానంలో కాలేయ మార్పిడిని విజయవంతంగా చేయడం అవయవ మార్పిడి చరిత్రలోనే ఇది కీలక ఘట్టంగా ఆయన పేర్కొన్నారు.
కాగా సౌదీలోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ స్పెషల్ వైద్య సేవలు అందించడంలో ప్రపంచంలోని బెస్ట్ ఆసుపత్రుల్లో ఒకటిగా పేరు గాంచింది. బ్రాండ్ ఫినాన్స్ వర్గీకరణ ఆధారంగా 2023 సంవత్సరానికి గానూ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సంస్థల జాబితాలో ఈ ఆసుపత్రి 20వ స్థానంలో నిలిచింది. అలాగు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో తొలి స్థానంలో ఉండటం విశేషం.