సూపర్ పవర్ కోసం భారత్‌కు ఆ దురాశ లేదు..
చైనాకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్¸్ కౌంటర్
న్యూఢల్లీి,డిసెంబర్ 17 (ఆంధ్రపత్రిక): ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా ఎదగాలనే తపనతో దురాక్రమణలకు పాల్పడి ఇతర దేశాల భూమిని స్వాధీనం చేసుకునే ఉద్దేశం భారత్‌కు లేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.దిల్లీలో జరిగిన పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ 95వ వార్షిక సదస్సులో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణ, వృద్ధి గురించి మాట్లాడుతూ చైనా పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రపంచ సంక్షేమం కోసం పనిచేసేందుకు భారత్ సూపర్ పవర్‌గా ఎదగాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.‘’భారత్‌ను సూపర్ పవర్‌గా మార్చడానికి అవసరమైన ఐదు అంశాల గురించి ప్రధాని మోదీ తన ఎర్రకోట ప్రసంగంలో తెలిపారు. అయితే ఇతర దేశాలపై ఆధిపత్యం చలాయించడం కోసమో లేదా.. ఇతర దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడం కోసమో.. మేం అత్యంత శక్తిమంతమైన దేశంగా మారాలనుకోవడం లేదు. ప్రపంచ సంక్షేమం కోసమే భారత్ పనిచేయాలనుకుంటోంది’’ అని రాజ్‌నాథ్ వివరించారు.ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల సేవలను రక్షణ మంత్రి కొనియాడారు. ‘’గల్వాన్ అయినా.. తవాంగ్ అయినా మన రక్షణ బలగాలు తమ శౌర్యపరాక్రమాలను నిరూపించుకున్నాయి. విపత్కర పరిస్థితులను ఎదుర్కొని వారు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు ప్రశంసనీయం. వారిని ఎంత పొగిడినా సరిపోదు’’ అని అభినందించారు.ఇక, చైనా సరిహద్దు పరిస్థితుల అంశంలో కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా రాజ్‌నాథ్ పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘’ప్రతిపక్షాల ఉద్దేశం ఏంటో మేం ఎప్పుడూ ప్రశ్నించలేదు. వారు అవలంబిస్తున్న విధానాలపైనే చర్చ జరిపాం. పార్టీల విధానాలు వాస్తవాలపై ఆధారపడి ఉండాలి. అంతేగానీ అవాస్తవాలను వ్యాప్తి చేస్తూ రాజకీయాలు చేయకూడదు’’ అని కేంద్రమంత్రి విపక్షాలను విమర్శించారు.