వరల్డ్ కప్లో టీమిండియాకు ఇది వరుసగా ఆరో విజయం. అయితే రోహిత్ సేనకు ఇంకా సెమీఫైనల్ బెర్తు ఖరారు కాలేదు. దీనికి కారణమేంటంటే.. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ఈ ప్రపంచకప్ జరుగుతోంది. ఒక్కో జట్టు 9 మ్యాచ్లు ఆడనుంది. తద్వారా నేరుగా సెమీ ఫైనల్ బెర్త్ సాధించాలంటే కనీసం
వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆదివారం లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది భారత జట్టు. వరల్డ్ కప్లో టీమిండియాకు ఇది వరుసగా ఆరో విజయం. అయితే రోహిత్ సేనకు ఇంకా సెమీఫైనల్ బెర్తు ఖరారు కాలేదు. దీనికి కారణమేంటంటే.. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ఈ ప్రపంచకప్ జరుగుతోంది. ఒక్కో జట్టు 9 మ్యాచ్లు ఆడనుంది. తద్వారా నేరుగా సెమీ ఫైనల్ బెర్త్ సాధించాలంటే కనీసం 7 మ్యాచ్లు తప్పక గెలవాలి. టీమ్ ఇండియా తదుపరి మ్యాచుల్లో శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తో తలపడనుంది. కాబట్టి ఈ మూడు మ్యాచ్ల్లో ఒక దాంట్లో విజయం సాధిస్తే 7 విజయాలతో టీమిండియా ఖాతాలో 14పాయింట్లు చేరుతాయి. దీంతో సెమీఫైనల్ ఆడనున్న నాలుగు జట్లలో చోటు దక్కించుకోవడం ఖాయం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా జట్లు 6 మ్యాచ్లు ఆడేశాయి. అయితే టీమ్ ఇండియా తప్ప, ఏ జట్టు 12 పాయింట్లు సంపాదించలేదు. మిగతా జట్ల విషయానికొస్తే.. 6 మ్యాచ్ల్లో 5 గెలిచిన దక్షిణాఫ్రికా 10 పాయింట్లతో 2వ స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ 6 మ్యాచ్ల్లో 4 విజయాలతో 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా 6 మ్యాచుల్లో 4 గెలిచి 4వ స్థానంలో ఉంది. అందువల్ల భారత జట్టు తదుపరి మూడు మ్యాచ్ల్లో ఒక్క విజయం సాధిస్తే టాప్-4లో స్థానం సంపాదించి సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటుంది.
శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఇప్పటి వరకు 5 మ్యాచ్లు మాత్రమే ఆడాయి. కాబట్టి ఈ రెండు జట్లలో ఒక జట్టు తదుపరి అన్ని మ్యాచ్లలో గెలిచి 12 పాయింట్లు సంపాదించే అవకాశం ఉంది. దీంతో 6 మ్యాచ్లు గెలిచినా టీమ్ ఇండియా సెమీఫైనల్ స్థానం ఖాయం కాదు. తదుపరి 4 మ్యాచ్ల్లో ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక జట్లు ఒక్కో మ్యాచ్లో ఓడిపోతే.. భారత జట్టు సెమీఫైనల్ ఆడడం ఖాయం.
భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్:
నవంబర్ 2: భారత్ vs శ్రీలంక (ముంబై)
నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా (కోల్కతా)
నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్ (బెంగళూరు)
టీమ్ ఇండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.