నరసాపురం జూలై 14 (ఆంధ్రపత్రిక గోపరాజు సూర్యనారాయణ రావు)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ టి దశరథ జనార్దన్, పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, పుత్తూరు ఇంచార్జి గాలి భాను ప్రకాష్ ( పుత్తూరు), చిత్తూరు పార్లమెంట్ ప్రెసిడెంట్ పులివర్తి నాని (చంద్రగిరి) లు అన్నారు. అమెరికా చార్లెట్ నార్త్ కరోలినా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మీట్ విత్ గ్రేట్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. నర్సాపురం నియోజకవర్గ తెదేపా సీనియర్ నాయకుడు కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకలో జనార్దన్, బాపిరాజు, ప్రకాష్, నానీలు ముఖ్య అతిథిలుగా పాల్గొని మాట్లాడుతూ యన్టీఆర్ , చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన ప్రభుత్వ పధకాలు, ఇంజనీరింగ్ కళాశాలల వల్ల బాగా చదువుకొని అమెరికా వంటి తదితర అభివృద్ధి చెందిన దేశాలలో స్థిరపడ్డారన్నారు. 2024 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకోవాలని దిశా నిర్దేశం చేసారు. యన్టీఆర్ సినీ జీవితంలో కాదు నిజ జీవితంలో కూడా హీరోనని అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం, రాజకీయ విలువలు, నారా చంద్రబాబు నాయుడు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి, పారదర్శక పరిపాలన తదితర విషయాలపై మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని 2024లో తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి, చంద్రబాబుని మళ్ళీ ముఖ్యమంత్రిగా శాసనసభలో తిరిగి కాలు పెట్టించాలని, దీనికి ఎన్నారైలు నడుము కట్టి, వ్యూహాత్మకంగా ఇండియాలో ఉన్న తమవారిని సన్నద్ధం చేయాలని చార్లెట్ ఎన్నారై టీడీపీ కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపారు. వేదికనంతటినీ కూడా పసుపు మయం చేయడమే కాకుండా జోహార్ యన్టీఆర్, జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!