జనసేన పోతిన మహేష్ నిందారోపణ
విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 5 (ఆంధ్రపత్రిక) : కాపు సామాజిక వర్గంపై పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కి అంత ద్వేషం ఎందుకని జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్ ఘాటుగా ఆరోపించారు. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కాపులపై వెలంపల్లి పదేపదే విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. మెగా కుటుంబం, పవన్ కళ్యాణ్ మీద పదేపదే విమర్శలు చేస్తున్నారని అన్నారు. వంగవీటి రాధాకృష్ణ పై రెక్కీ నిర్వహించిన వారికి మద్దతు ఇచ్చారని విమర్శించారు. వైసీపీ కార్పొరేటర్ భర్త అత్తులూరి పెదబాబు ఆత్మహత్య చేసుకునేలాగా కేబుల్ మాఫియాను ప్రోత్సహించారని ఆరోపించారు.భవానిపురంలో కార్పొరేటర్లకు అన్యాయం చేశారన్నారు. సీనియర్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను , సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ని బూతు పదజాలంతో అవమానించారని మహేష్ ఆగ్రహం వ్యక్తంచేసారు.