శతాధిక చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరనేది ఇంకా తేలట్లేదు. అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీ పరంగా ఏర్పాట్లు పూర్తవుతున్నా..ఆ పదవి చేపట్టేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ ముందుకు రావట్లేదు. రాహుల్‌ను ఒప్పించేందుకు హస్తం పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు మరోసారి విఫలమైనట్లు తెలుస్తోంది. అటు సోనియా గాంధీ కూడా విముఖంగానే ఉండటంతో కాంగ్రెస్‌కు తదుపరి అధ్యక్షులెవరనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.ఈ నెల 21 నుంచి సెప్టెంబరు 20 మధ్య పార్టీ సారథి ఎన్నిక పూర్తవుతుందని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికల్లో ఓటేసే వారి జాబితాను సిద్ధం చేశారు. త్వరలోనే ఎన్నికల తేదీని కూడా ప్రకటించనున్నారు. అయితే ఈ పదవి చేపట్టేందుకు రాహుల్ మాత్రం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ‘’అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని రాహుల్ చెప్పారు. కానీ, ఆయనను ఒప్పించేందుకు మేం ప్రయత్నాలు చేస్తున్నాం’’ కాంగ్రెస్ సీనియర్ ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు, ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ మరోసారి సారథ్య పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. అనారోగ్య కారణాల రీత్యా ఆమె ఈ బాధ్యతలను కొనసాగించేందుకు సిద్ధంగా లేరని పార్టీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.ఇదిలా ఉండగా.. అధ్యక్ష పదవికి ప్రియాంక గాంధీ వాద్రా పేరు కూడా తెరపైకి వస్తోంది. గాంధీ కుటుంబమే పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని కాంగ్రెస్‌లో అత్యధికులు భావిస్తున్నారు. దీంతో రాహుల్ ఒప్పుకోకపోతే ఆమె పేరును ప్రతిపాదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక వైఫల్యాల దృష్ట్యా ఆమెకు పగ్గాలు అప్పగించే అవకాశాలు లేకపోవచ్చని సమాచారం. దీంతో పార్టీ తదుపరి అధ్యక్షులు ఎవరనే దానిపై సందిగ్ధత వీడట్లేదు.లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ 2019లో రాజీనామా చేశారు. నేతల ఒత్తిడితో ఆ బాధ్యతను సోనియాగాంధీ మరోసారి స్వీకరించారు. మధ్యలో సీనియర్ నేతలు అసమ్మతి గళం వినిపించినప్పుడు రాజీనామా చేసేందుకు ఆమె సిద్ధపడినా సీడబ్ల్యూసీ విన్నపం మేరకు కొనసాగుతున్నారు. మరోవైపు అధ్యక్ష పదవిపై ఆసక్తిగా లేనప్పటికీ.. కేంద్రంపై కాంగ్రెస్ పోరును రాహుల్ ముందుండి నడిపిస్తున్నారు. సెప్టెంబరులో ఆయన కన్యాకుమారి నుంచి ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించనున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!