Where is Pushpa?: ‘పుష్పరాజ్’ ఎక్కడ?.. సమాధానం తెలిసేది ఎప్పుడంటే?
‘పుష్ప ది రైజ్’లో ‘పుష్ప’ని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ఎక్కడా చూపించలేదు. చివరిలో భన్వర్ సింగ్ షికావత్ పాత్రను అవమానించినట్లుగా చూపించారు. ఇప్పుడు విడుదల చేసిన గ్లింప్స్ ప్రకారం..

ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురు చూస్తుంది. ‘పుష్ప ది రూల్’ చిత్రీకరణకు సంబంధించి సెట్స్‌పైకి వెళ్లడానికి టీమ్ చాలా సమయం తీసుకున్నప్పటికీ.. సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత మాత్రం అస్సలు ‘తగ్గేదే లే’ అన్నట్లుగా టీమ్ స్పీడ్ చూపిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ చిన్న గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు. ఇందులో.. ‘‘తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అని బ్యాగ్రౌండ్లో వాయిస్‌లో వినిపిస్తే.. తప్పించుకునేందుకు బైక్ పై వేగంగా ‘పుష్ప’ వెళుతున్నట్లుగా చూపించారు. అనంతరం అల్లర్లు, పోలీసులతో.. ఓ యుద్ధ వాతావరణాన్నే చూపించారు. అసలు పుష్ప ఎక్కడ? అంటూ ‘హంట్ బిఫోర్ ద రూల్’ అని వెల్లడించారు.
‘పుష్ప ది రైజ్’లో ‘పుష్ప’ని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ఎక్కడా చూపించలేదు. చివరిలో భన్వర్ సింగ్ షికావత్ పాత్రను అవమానించినట్లుగా చూపించారు. ఇప్పుడు విడుదల చేసిన గ్లింప్స్ ప్రకారం.. ఆ సీన్ తర్వాత ‘పుష్పరాజ్’ని అరెస్ట్ చేసి జైలుకు పంపడం, జైలు నుంచి అతను తప్పించుకోవడం జరుగుతుందనేది తెలుస్తుంది. మొత్తంగా అయితే.. చిన్న గ్లింప్స్‌తోనే సినిమాపై మరింతగా ఆసక్తిని క్రియేట్ చేశారు. ఇక పుష్పరాజ్ ఎక్కడున్నాడో? ఏమయ్యాడో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 4 గంటల 05 నిమిషాల వరకు వెయిట్ చేయకతప్పదు అనేలా మేకర్స్ టైమ్ ఇచ్చారు. ఈలోపు ‘పుష్ప’ ఏమయ్యాడో.. ఎవరికి వారు ఊహించేసుకోవచ్చు. ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ‘పుష్ప 2’ టీజర్‌ని ఏప్రిల్ 7న విడుదల చేయబోతుందని ఇలా చిన్న గ్లింప్స్‌తో మేకర్స్ తెలియజేశారు. ఇక ఈ చిన్న గ్లింప్స్ వీడియోనే ఇలా ఉందంటే.. ఇక టీజర్ ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ గ్లింప్స్ వీడియోతో పాటు ఏప్రిల్ 5 రష్మిక మందన్నా పుట్టినరోజును పురస్కరించుకుని.. శ్రీవల్లికి సంబంధించిన పోస్టర్స్‌ని ‘పుష్ప’ మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీవల్లి పోస్టర్, వేర్ ఈజ్ పుష్ప? గ్లింప్స్‌తో ‘పుష్ప’ ట్రెండ్‌లో సందడి చేస్తున్నాడు.