రాజమండ్రి జైలులో చంద్రబాబు భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టారు డీఐజీ రవికిరణ్. స్నేహ బ్లాక్‌తో పాటు పరిసరాలను పరిశీలించారు. సెంట్రల్ జైలులో సెక్యూరిటీ సహా పలు అంశాలపై తనిఖీలు చేశారు. ఇప్పటికే జైలులో చంద్రబాబుకు 4+1 భద్రత కల్పించారు.
అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపు మేరలో కనిపించనప్పుడు కత్తి పట్టడం సరైన చర్య అవుతుందంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా. పోరాటం చేయడం కూడా సరైన చర్యే అవుతుందని ఈ ట్వీట్లో కోట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు తరపున కోర్టులో వాదనలు వినిపిస్తున్న లూథ్రా, ఈ సమయంలో ఇలాంటి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. పంజాబీల గురువు గురు గోబింద్ సింగ్ అప్పటి మొఘుల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ను ఉద్దేశించి రాసిన జఫర్‌నామాలో ఈ మాటలున్నాయి. దీనికి సంబంధించి ఉర్దూలో గురుగోబింద్ సింగ్ మాటల ఫొటోను ట్యాగ్ చేశారు.
క్వాష్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి. విచారణ చేపట్టే ముందు ఇరువర్గాల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. నేను గతంలో స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసాను.. మీకు అభ్యంతరం ఉంటే నాట్ బిఫోర్ మీ అని ఇస్తానన్నారు. అయితే ఇరు పార్టీల న్యాయవాదుల అంగీకారం తెలపడంతో కేసు విచారణ చేపట్టారు. సరైన సాక్ష్యాలు లేకుండానే జ్యుడిషియల్ రిమాండ్ విధించారంటూ పిటిషన్ వేశారు చంద్రబాబు తరపు లాయర్లు. ఈ నెల 10న ఏసీబీ కోర్టు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు.
హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ఏఏజీ సుధాకర్‌రెడ్డి కోరారు. సోమవారం విచారణ జరపాలని న్యాయవాదులు కోరారు. అయితే సోమవారం వినాయకచవితి సెలవు కావడంతో మంగళవారం వాదనలు వింటామన్నారు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా మంగళవారానికి వాయిదా పడింది. ఈ కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్ట్‌లో అప్పీల్ చేశారు చంద్రబాబు.
రాజమండ్రి జైలులో చంద్రబాబు భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టారు డీఐజీ రవికిరణ్. స్నేహ బ్లాక్‌తో పాటు పరిసరాలను పరిశీలించారు. సెంట్రల్ జైలులో సెక్యూరిటీ సహా పలు అంశాలపై తనిఖీలు చేశారు. ఇప్పటికే జైలులో చంద్రబాబుకు 4+1 భద్రత కల్పించారు. చంద్రబాబు భద్రతపై ప్రభుత్వ బాధ్యత అని ఏఏజీ పొన్నవోలు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు బాబు అరెస్ట్, రిమాండ్‌కు నిరసనగా టీడీపీ శ్రేణులు నిరసన కొనసాగిస్తున్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రిలే నిరాహార దీక్షకు దిగిన టిడిపి కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించారు పోలీసులు. దీంతో పోలీసులకు, టిడిపి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బలవంతంగా దీక్షలను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు నేతలు. చంద్రబాబు అరెస్టునునిరసిస్తూ గుంటూరు జిల్లా రేపల్లె బూరగలమ్మ వారి దేవస్ధానములో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు టీడీపీ నేతలు. ఆ తర్వాత ర్యాలీ చేశారు.