కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య నిధుల పంచాయితీ సద్దుమణగడం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ పై వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడుతోంది. ఇప్పటికే అప్పుల విషయంలో కొర్రి కొనసాగుతుండగా ఎన్ఆర్ఈజీఎస్ కోసం చెల్లిస్తున్న నిధుల విషయంలో కొత్త పంచాయితీ రాజకీయ రచ్చ రేపుతోంది. ఉపాధి కూలీలకు డబ్బుల చెల్లింపుల్లో తెలంగాణ ప్రభుత్వమే జాప్యం చేస్తోందని బీజేపీ వాదిస్తుంటే.. అదేవిూ కాదని ఉపాధి పనుల డబ్బుల పంపిణీ కేంద్రం పరిధిలో ఉందని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ కౌంటర్ ఇస్తోంది.బీజేపీ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు టీఆర్ఎస్ సర్కార్ వాట్సాప్ ఆర్మీని తయారు చేస్తోంది. ఇందుకోసం ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉపాధి హావిూ పనులను మానిటరింగ్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంఎంఎస్ యాప్‌ను ఉపయోగిస్తోంది. పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఈ యాప్‌లో కూలీల వివరాలు, పని చేస్తున్న ప్రాంతాల, మాస్టర్ రోల్స్ వంటి డేటాను పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ యాప్‌కు సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గ్రూపులు తయారు చేయాలని నిర్ణయించింది. ఎన్ఆర్ఈజీఎస్ కార్మికులకు ఆలస్యంగా చెల్లింపులు జరగడానికి ఎవరు బాధ్యత వహిస్తారనే దానిపై ఈ వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా టీఆర్ఎస్ ప్రజల్లో అవగాహన కల్పించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో గ్రామ పంచాయతీకి ఎన్నికైన సర్పంచ్‌తో పాటు ఓటమి పాలై రెండో స్థానంలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థి, ఎన్నికైన వార్డు మెంబర్లు, ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్లతో పాటు ఓటమి పాలై రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులను ఈ వాట్సాప్ గ్రూప్స్‌లలో చేర్చాలని ప్రభుత్వం పేర్కొంది. ఉపాధి హావిూ పనుల వివరాలను ఈ గ్రూప్‌లలో ఎప్పటికప్పుడు పంచాయతీ సెక్రటరీలు మానిటరింగ్ చేస్తూ సమాచారాన్ని ఇందులో వేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా అసలు నిధుల సమస్య ఎక్కడి నుండి వస్తుందో అందరికి అర్థం అవుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వబోతోందట. అయితే ఇప్పటికే అనేక పనుల వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న తమకు వాట్సాప్ గ్రూప్‌ల పనులు మరో తలనొప్పిగా మారుతాయని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!