ఇచ్ఛాపురం: సింహాచలం (Simhachalam)లో సంబరంగా పెళ్లి (Wedding) చేసుకున్నారు. వరుడి ఇంట్లో రిసెప్షన్ (Reception) జరుపుకున్నారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత వధువు ఇంటికి వెళ్లారు. కాసేపు ఉండి బైక్ (Bike) పై బయల్దేరారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. రోడ్డు ప్రమాదంలో వధూవరులిద్దరూ (Bride and groom) మృతి చెందారు. శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఇచ్ఛాపురం (Ichhapuram) మున్సిపాల్టీ 23వ వార్డు బెల్లుపడ కాలనీకి చెందిన గవలపు నాగరత్నం, రామారావు కుమారుడు వేణు అలియాస్ సింహాచలం (26)కు ఒడిసా (Odisha) రాష్ట్రం బరంపురానికి చెందిన సుభద్ర అలియాస్ ప్రవల్లిక (23)తో ఈనెల 10న సింహాచలం వరహా లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో వివాహమైంది (Marriage). పెళ్లికి బంధువులందరూ హాజరయ్యారు. ఈనెల 12న ఆదివారం మధ్యాహ్నం వరుడు ఇంటివద్ద రిసెప్షన్ (విందు) జరిగింది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం సోమవారం సాయంత్రం బరంపురానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. కాసేపు ఉండి తిరిగి బయల్దేరారు. బలేగడ జాతీయ రహదారి పెట్రోల్ బంక్ (Petrol Bunk) సమీపంలో వీరి బైక్ ప్రమాదానికి గురైంది. వీరి బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో వధువు ఘటనా స్థలంలోనే మృతి చెందగా తీవ్ర గాయాలతో పడి ఉన్న వరుడిని స్థానికులు బరంపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. వేణు వస్త్ర దుకాణం (Clothing store)లో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!