నైరుతి రుతుపవనాల ఆలస్యంతో ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల పాటు ఎండ తీవ్రత ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనెజింగ్ డైరెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. నేడు అల్లూరి జిలాలోని నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని చెప్పారు.
నైరుతి రుతుపవనాల ఆలస్యంతో ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల పాటు ఎండ తీవ్రత ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనెజింగ్ డైరెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. నేడు అల్లూరి జిలాలోని నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని చెప్పారు. ఏలూరు జిల్లాలోని కుకునూర్, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొన్నారు. మరో 212 మండల్లాలో కూడా వడగాల్పులు వీస్తాయని చెప్పారు. నిన్న ఏన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 43.3°C, ఏలూరు జిల్లా శ్రీరామవరంలో 43.1°C, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఈరోజు అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.
శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°C లు.. విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39°C – 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు వడగాల్పులు,ఎండ తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.