చల్లపల్లి అక్టోబర్ 29 ఆంధ్ర పత్రిక.:
రాబోయే ఎన్నికల్లో టిడిపి జనసేన కలయికతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. చల్లపల్లిలో నూతన జన సేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన బండ్రెడ్డి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం ఆనందదాయకంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గం లో జనసేన టిడిపి అభ్యర్థి మొట్టమొదటిగా గెలిచే నియోజకవర్గం అని అందరం కలిసికట్టుగా శ్రమించి అవనిగడ్డలో జనసేన, టిడిపి బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుందామని రామకృష్ణ అన్నారు. పవన్ కళ్యాణ్ ఆజ్ఞ మేరకు నియోజకవర్గంలో టిడిపి తో కలిసి పని చేస్తాం అని అన్నారు. అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా జనసేన, టిడిపి అభ్యర్థులను బలపరిచి వాళ్ళని గెలిపించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తూ కృషి చేస్తామన్నారు. త్వరలో విజయవాడలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఆ సమావేశంలో భవిష్య ప్రణాళిక రూపొందించుకొని, గడపగడపకి ప్రభుత్వం అన్న నినాదంతో ప్రజలతో మమేకం అవుతామన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం , నిజమైన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం మనందరి ఏకైక లక్ష్యం అని అన్నారు. జనసేన, టిడిపి అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని బండ్రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి, అవనిగడ్డ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఏకైక మార్గం, లక్ష్యం ,టిడిపి జనసేన ఉమ్మడి కార్యాచరణ అని అన్నారు. పవన్ మార్గమే మా అందరికీ శిరోధార్యమన్నారు. చల్లపల్లిలో వీరబాబు ఆధ్వర్యంలో యువత, జనసెన నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆనందదాయకంగా ఉందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా జనసేన , టిడిపి కలిసి పనిచేస్తుందన్నారు.