గజపతి నగరం ఇన్ ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కె.నాయుడు
జామి, ఫిబ్రవరి 9 (ఆంధ్రపత్రిక) : మండలం లొట్లపల్లి, భీమసింగి గ్రామాల్లో గురువారం సాయంత్రం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో నియోజకవర్గం ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే డా.కే.ఏ.నాయుడు పాల్గొని ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసు కున్నారు. త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని, ధాన్యం కొనుగోలు సక్రమంగా చేయక ఇబ్బంది పడుతున్నామని అన్నారు. ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేవరకు రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తామని అన్నారు.నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల మద్దతు బాగుందని, ప్రజలం దరి మద్దతుతో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, శాసనసభ్యునిగా గెలిచి, చంద్రన్న సారధ్యంలో మరలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పొలిపర్తి స్వామి నాయుడు, పార్లమెంట్ కార్యదర్శి కొత్తలి సూర్యారావు, మండల ప్రధాన కార్యదర్శి ధనియాల పైడిరాజు, క్లస్టర్ ఇంఛార్జి సబ్బవరపు సత్యన్నారాయణ, పార్టీ నాయకులు కడియాల గోపి, రమణ, లక్ష్మి, అప్పలనాయుడు, జగన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.