హైదరాబాద్,అక్టోబర్ 6 (ఆంధ్రపత్రిక): తెలంగాణలో దళితుల అభివృద్ది కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాల్సిన అవసరం వుందన్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను వీసీకే పార్టీ అధినేత, ఎంపీ తిరుమా వళవన్తో పాటు వివిధ రాష్ట్రాల నాయకులు కలిశారు. సీఎం కేసీఆర్కు ఎంపీ తిరుమావళవన్ శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే హైదరాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వున్న దళిత సోదరులతో దళిత్ కాంక్లేవ్ నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడిరచారు. అనంతరం ఎంపీ తిరుమావళవన్ మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నానని చెప్పారు. దళితుల కోసం ఇన్ని పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు గొప్ప పథకమని అభినందించారు. సీఎం కేసీఆర్ను కలిసిన వారిలో రైతు నాయకులు రాకేశ్ రఫీక్, అక్షయ్ (ఒడిషా), సీనియర్ జర్నలిస్టు వినీత్ నారాయణ (ఢల్లీి), సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు గుర్నామ్ సింగ్ (హర్యానా), మహారాష్ట్ర రైతు నాయకుడు దశరథ్ సావంత్ తదితరులు ఉన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!