చీడికాడ, ఫిబ్రవరి08(ఆంధ్రపత్రిక):
తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో మండలంలో ఎల్.బి.పట్నం గ్రామంలో బుధవారం రాత్రి ఇదేం కర్మ మన రాష్ట్రానికి, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగుదేశంపార్టీ మాడుగుల నియోజకవర్గం ఇన్చార్జి పీవీజీ కుమార్ మాట్లాడుతూ మళ్లీ మనందరికీ మంచి రోజులు రావాలంటే మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ప్రభుత్వ విధానాలు, పాలకులపై విమర్శలు, ఆరోపణలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇంఛార్జి పేరపు కొండబాబు, గ్రామపార్టీ ఉపాధ్యక్షులు నారాయణమూర్తి, మాజీ సర్పంచ్ బండారు దేముడునాయుడు, నాయకులు బండారు శేషగిరి, సింగంపల్లి కాసు, జక్కాన సింహాద్రినాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు.