-డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు
కె.కోటపాడు,ఫిబ్రవరి09(ఆంధ్రపత్రిక): పారదర్శకంగా, అవినీతిరహితంగా, ఆదర్శంగా అందిస్తున్న పథకాలను మరింత సమర్థవంతంగా, పటిష్టంగా అమలుకు, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహిస్తున్నామని డిప్యూటీ సిఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. మండలంలో చౌడువాడ సచివాలయం పరిధిలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గడప గడపను సందర్శించినప్పుడు మూడేళ్ళలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలనులబ్ధిదార్లకు అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనసుపెట్టివెళ్లి ప్రతిసమస్యపరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నానని అన్నారు.విశాఖ డెయిరీ సౌజన్యంతో గవరపేట నుండి చౌడువాడ, జుత్తాడ మీదుగా రూ.50లక్షల వ్యయంతో 552 మీటర్ల తారు రోడ్డు, 360 మీటర్ల డ్రైనేజ్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. లింక్ రోడ్డులు, డ్రైనేజ్ పునరుద్ధరణ పూర్తి స్థాయిలో చేపట్టాలని, అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. జె.జె.ఎం.ద్వారా అన్నిఇళ్ళకూ కుళాయిలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. పౌష్ఠిాహారం పంపిణీపై అరా తీశారు. చిన్నారులకు తినుబండారాలు ఇచ్చారు. గ్రామంలో విద్యుత్ పోల్స్, వైర్లు ప్రమాదకరస్థాయిలో ఉంటే తొలగించి వాటి స్తానే కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులను డిప్యూటీ సిఎం ముత్యాలనాయుడు ఆదేశించారు.ఈ కార్యక్రమంలోఎంపిపి రెడ్డి జగన్ మోహన్, జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనూరాధ, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు ఏటుకూరి రాజేష్, తహసీల్దార్ రమేష్ బాబు, ఎంపీడీఓ డాక్టరు శచీదేవి, నాయకులు దాట్ల శివాజీరాజు,పలుశాఖల మండల, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.