Watch Video: ఆయిల్ ట్యాంకర్లో గుట్టుగా యవ్వారం.. అనుమానంతో పోలీసుల తనిఖీ! తర్వాత ఏం జరిగిందంటే
ANDHRAPATRIKA : – – పాట్నా, అక్టోబర్ 23: ప్రముఖ కంపెనీ పేరుతో ఉన్న ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా మద్యం రవాణా చేస్తూ ఎక్సైజ్ శాఖకు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో సదరు ఆయిల్ ట్యాంకర్‌ను వెంబడించి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఇక పోలీసులను చూసిన డ్రైవర్, అందులోని వ్యాపారి వాహనాన్ని రోడ్డుపైనే వదిలి పరారయ్యారు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ HP ఆయిల్ ట్యాంకర్లో మద్యం రవాణా చేస్తున్నట్లు బీహార్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సమాచారం అందింది. స్మగ్లర్లను పట్టుకునేందుకు ఓ టీంను ఏర్పాటు చేసి రహదారిపై మాటు వేశారు. అదే రూటులో వచ్చిన నాగాలాండ్‌లో రిజిస్టర్ చేయబడిన హెచ్‌పీ ఆయిల్ ట్యాంకర్ పోలీసులను చూసి, నేషనల్ హైవే వైపు దారి మళ్లించారు. గమనించిన పోలీసులు ఆ ట్యాంకర్‌ను వెంబడించారు. కొంత దూరం వెళ్లాక పోలీసులు ట్యాంకర్‌ను చేజ్ చేసి ఆపగలిగారు. వెంటనే అందులోని డ్రైవర్, మద్యం వ్యాపారి ట్యాంకర్‌ను వదిలి పారిపోయారు. ట్యాంకర్ నుంచి సుమారు 200 మద్యం డబ్బాలను ట్యాంకర్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ విజయ్ శేఖర్ దూబే తెలిపారు. ఆయిల్ ట్యాంకర్ నుంచి మద్యం కార్టన్లను బయటకు తీస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.