వెల్లింగ్టన్ : తాను మంచి తల్లిగా ఉండాలనుకుంటున్నట్లు న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రసంగిస్తూ..తాను మంచి తల్లిగా ఉండాలనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని అన్నారు.
నాయకత్వం వహించాలనుకునే మహిళలకు మాతఅత్వం అడ్డు కాకూడదని అన్నారు. ఆమె గత జనవరి నెలలో ప్రధాని పదవికి రాజీనామ చేస్తూ అందర్నీ షాక్ గురి చేసిన సంగతి తెలిసిందే. తన ఐదేళ్ల పాలనలో దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్షోభాలను ఆమె చూశారు. 2019 క్రైస్ట్చర్చిలోని రెండు మసీదులపై జరిగి తీవ్రవాద దాడిలో 51 మంది మరణించారు. అదే ఏడాది అగ్నిపర్వతం విస్పోటనం చెంది సుమారు 22 మంది మరణించారు. తర్వాత కరోనా ఇలా వరుస సంక్షోభాలను జెసిండా పాలన ఎదుర్కొంది
భయంకరమైన క్షణాల్లో తన దేశాన్ని విచారంగా చూశానని, అలాగే దు:ఖభరితంగా ఉన్నప్పుడూ దేశాలు ముందుకు సాగలేవని తెలుసుకున్నానని జెసిండా తన ప్రసంగంలో చెప్పారు. ఆ ఘటనలు తన మనస్సులో భాగమయ్యాయని అన్నారు. కానీ ఆ క్షణాలు మన ఉనికిలో భాగమవడమేగాక వాటిని ఎదుర్కొనేలా కూడా సన్నద్ధమవ గలగుతామని ఆమె చెప్పారు. 2018లో జెసిండా శ్రామిక మహిళలకు పెద్ద పీఠ వేస్తూ..బెనజీర్ బుట్టో తర్వాత శక్తిమంతమైన రెండో ప్రపంచ నాయకురాలిగా జెసిండా పేరుగాంచారు. అందుకే ఆమెను న్యూజిలాండ్ ప్రజలు టార్చ్ బేరర్ అని పిలుచుకుంటారు. న్యూజిలాండ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే జెసిండా కూతురికి జన్మనిచ్చారు. అలా పదవిలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగానూ రికార్డు సఅష్టించారు. రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన జెసిండా…క్రైసిస్ మేనేజర్ బిరుదు సంపాదించుకున్నారు. ఆమె తన చివరి పార్లమెంట్ ప్రసంగంలో వాతావరణ మార్పులను ప్రస్తావించారు.