అక్టోబర్ 27 (ఆంధ్రపత్రిక): అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి జాన్వీ కపూర్. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా కొత్త బాటలో పయనిస్తూ బాలీవుడ్లో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. కాగా, జాన్వీకి తన తల్లి మాదిరిగానే దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఉందట. ఈ విషయాన్ని ఇప్పటికే ఆమె తండ్రి బోనీ కపూర్ చెప్పాడు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కూడా తన మనసులోని మాట బయటపెట్టింది. టాలీవుడ్ యువ నటుల్లో అందరూ తనకు ఇష్టమైనవారే అని.. అయితే, ముఖ్యంగా తనకు అవకాశం వస్తే మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి ఒక సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది ఈ బీటౌన్ సుందరి. సౌత్ సినిమాలను తాను తప్పకుండా చూస్తుంటానని చెప్పింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ’ఆర్ఆర్ఆర్’ చిత్రం తనకెంతో నచ్చిందని జాన్వీ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసించింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!