నవంబర్ 14 (ఆంధ్రపత్రిక): ’గాడ్ ఫాదర్’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి, మూడు నెలల గ్యాప్‌తో ’వాల్తేరు వీరయ్య’గా రాబోతున్నారు. అభిమానులు ఆయన నుండి ఆశించే అన్ని రకాల మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బాబి. చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్ నటిస్తోంది. రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్ చేస్తోంది. టైటిల్ టీజర్‌తో సినిమా ఎంత మాస్‌గా ఉండబోతోందో చెప్పిన టీమ్, త్వరలోనే ఒక్కో పాటను విడుదల చేయబోతున్నారు. ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయబోతున్న విషయాన్ని ఆదివారం దేవిశ్రీ ప్రసాద్ రివీల్ చేశాడు. ’ఇప్పుడే ’వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ సాంగ్ చూశా. మెగాస్టార్ స్టెప్పులు మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. అందుకే కంట్రోల్ చేసుకోలేక మొదటి పాట ఈ వారంలోనే రాబోతోందని లీక్ చేస్తున్నా’ అంటూ ఊరిస్తున్నాడు దేవిశ్రీ. అంతేకాదు.. ’పార్టీకి రెడీ అవ్వండి.. ఎందుకంటే ఇది బాస్ పార్టీ’ అంటూ ఆ పాటేమిటో కూడా రివీల్ చేశాడు. పాటతో పాటు మెగా డ్యాన్సులపై అంచనాలు పెరిగాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!