ముఠామేస్త్రీ తరహాలో ఉంటుందన్న టాక్
నవంబర్ 24 (ఆంధ్రపత్రిక): మాస్ డ్యాన్సులు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. కొంత గ్యాప్ తర్వాత ఆయన పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్లో నటిస్తోన్న సినిమా ’వాల్తేరు వీరయ్య’. ఇందులోని ఆయన గెటప్ ’ముఠామేస్త్రి’ చిత్రాన్ని గుర్తు చేస్తోంది. ఆ అంచనాలను మరింత పెంచుతూ ’బాస్’ సాంగ్ పేరుతో మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇందులో తనదైన స్టెప్పులతో ఇంప్రెస్ చేశారు చిరంజీవి. ’బాస్ వస్తుండు’ అంటూ దేవిశ్రీ ప్రసాద్ వాయిస్‌తో మొదలైన ఈ పాట మెగాస్టార్ అభిమానులకు ఐ ఫీస్ట్‌లా ఉంది. ’క్లబ్బుల్లోనా పార్టీ అంటే షరా షరా మామూలే.. హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏ మూలే.. బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే.. క్రూజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగా పండదులే.. నా బోటే ఎక్కు.. డీజే నొక్కు బొంబాట్ పార్టీ’ అంటూ సాగే పాటలో చిరంజీవి లుంగీ పైకి కట్టి మాస్ స్టెప్పులతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. ’వేర్ ఈజ్ ద పార్టీ, బాసు వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ చిరుతో కలిసి మెస్మరైజింగ్ మూమెంట్స్ చేసింది ఊర్వశి రౌటేలా. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేయడంతో పాటు లిరిక్స్ కూడా రాసి, నకాష్ అజీజ్, హరి ప్రియతో కలిసి పాడిన విధానం ఆకట్టుకుంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్. రవితేజ, కేథరిన్ థ్రెసా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.