కె.కోటపాడు,ఫిబ్రవరి14(ఆంధ్రపత్రిక):ఫేస్ యాప్ అటెండెన్స్ నుంచి వి.ఆర్.ఎ.లకు మినహాయింపు ఇవ్వాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు కంచెల రవికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం అయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా కమిటీ ప్రతినిధులతో ఈ మేరకు అనకాపల్లి డిఆర్ఓకు వినతిపత్రం అందజేశామని చెప్పారు. రూ.26 వేలు పే-స్కేలు అమలు చేయాలని, పాత డీఏ రికవరీ అమోంట్ ను జీతాలతో కలిపి చెల్లించాలని, నామినీ వి.అర్.ఎ.లను రెగ్యులర్ చేయాలని, అర్హులైన వి.ఆర్.ఎ.లకు పదోన్నతులు కల్పించాలని,65 సంవత్సరాలు వయసు పైబడ్డాక మృతి చెందిన వీఆర్ఏ కుటుంబాల్లో ఒకరికి2005జీఓ ప్రకారం తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలని అయన డిమాండ్ చేశారు. వినతి పత్రం అందచేసిన వారిలో అనకాపల్లి జిల్లా కార్యదర్శి డేవిడ్, ఉపాధ్యక్షులు నరేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ క్రాంతికుమారి, జిల్లా కోశాధికారి ఎన్.సంతోష్ కుమార్, అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు కోటేఈశ్వరరావు, ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ(సిటు),అనకాపల్లి డివిజన్ అధ్యక్షులు తోటాడ సింహాచలం, కార్యదర్శి పరదేశినాయుడు తదితర్లు ఉన్నారని రవికుమార్ చెప్పారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!