Vizag: విశాఖ హనీ ట్రాప్ కేసులో ట్విస్టు.. పదుల సంఖ్యలో జమీమా బాధితులు
ANDHRAPATRIKA : – – హనీ ట్రాప్ కేసులో జాయ్ జమీమా కథలు ఒక్కోటిగా బయటికొస్తున్నాయి. పదుల సంఖ్యలో బాధితులను మోసం చేసింది జమీమా. సోషల్ మీడియా వేదికగా యువకులకు వలపు వల విసిరి..
వారి నుంచి లక్షలకు లక్షలు లాగేసినట్లు తెలుస్తోంది. జమీమాను రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు కంచెరపాలెం పోలీసులు. మొబైల్ డేటా ఆధారంగా అనేక ప్రశ్నలు వేశారు. ఆమె అకౌంట్స్‌లోకి జరిగిన ట్రాన్సాక్షన్లపైనా కూపీ లాగారు. ఈ విషయంలో పొంతనలేని సమాధానాలు చెప్పింది జమీమా. మురళీనగర్‌లోని ఇంట్లో ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది.
జాయ్ జమీమా మొత్తం మూడు ఫోన్లు వాడినట్లు నిర్ధారించారు పోలీసులు. వాటిలో ఓ ఫోన్ మిస్సింగ్. యాపిల్ లాప్టాప్ కూడా మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ముగ్గురు బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు బాధితులు పోలీసులను సంప్రదించారు. యువకులను ముగ్గులోకి దించి.. ప్రేమపేరుతో దగ్గర అయ్యాక బెదిరించడం.. బ్లాక్మెయిల్ చేయడం జమీమా మోడస్ ఆపరాండి. ఆతర్వాత లక్షల రూపాయలు లాగేసింది జమీమా అండ్ టీమ్. ఆమె ఖాతాలో పదుల సంఖ్యలో బాధితులున్నారు. పరువు పోతుందని కొందరు బయటకు రావడం లేదంటున్నారు పోలీసులు. జాయ్ జమీమా కేసుపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రత్యేక టీమ్‌తో ఈమెగారి చీటింగ్ లెక్కలు తేలుస్తున్నారు.