తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత గడ్డం వివేక్, ఆయన కుమారుడు వంశీ పార్టీకి రాజీనామా చేశారు. వీళ్లిద్దరూ రాహుల్ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉన్న జి.వివేక్…కొంతకాలంగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇవాళ ఉదయం ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఫోన్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీని కలవాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ MP వివేక్ వెంకటస్వామి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేంద్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న వివేక్ వెంకటస్వామి.. బీజేపీ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. వివేక్ వెంకటస్వామిని ఇటీవల బీజేపీ ఎన్నికల మేనిఫేస్టో కమిటీ ఛైర్మన్‌గా నియమించింది అధిష్టానం.
వివేక్‌తో పాటు కుమారుడు వంశీ కూడా రాహుల్‌తో సమావేశం అయ్యారు. తన కుమారుడి కోసమే వివేక్ బీజేపీకి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వివేక్ కుమారుడు వంశీకి కాంగ్రెస్ పార్టీ చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఆశించినట్లుగా సమాచారం. ఈ సీటును పొత్తులో భాగంగా సీపీఐకు కేటాయిస్తారని.. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవచ్చనే వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి..
తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ నాయకత్వం ఈ మధ్యే ప్రతిష్ఠాత్మకంగా 14 కమిటీలు ఏర్పాటు చేసింది. సీనియర్లకు ఆ కమిటీల బాధ్యతలు అప్పగించింది. ఎన్నికలకు సంబంధించి కీలకమైన స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని నియమించింది. ఆయన మొన్ననే పార్టీకి గుడ్‌బై చెప్పి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అలా చేరిన వెంటనే ఆయనకు కాంగ్రెస్ పార్టీ మునుగోడు టికెట్ కేటాయించింది. ఇప్పుడు కీలకమైన మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న వివేక్ వెంకటస్వామి పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు వివేక్.
చెన్నూరు టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే చెన్నూరు విషయంలో సీపీఐకి కాంగ్రెస్ మాట ఇవ్వకపోవడానికి కారణం వివేక్ చేరికేననే మాటలు కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. మొత్తానికి సీనియర్లు ఇలా పార్టీని వీడుతుండటం కమలం క్యాడర్‌ను కలవరానికి గురిచేస్తోంది.
వరుస కష్టాల్లో తెలంగాణ బీజేపీ..
తెలంగాణ బీజేపీకి వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. తెలంగాణలో అధికారం చేపట్టేది తామేనని ధీమాగా చెప్తున్న కమలం నేతలు తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కలవరానికి గురిచేస్తున్నాయనే చెప్పాలి. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇప్పుడు వివేక్ వెంకటస్వామి బీజేపీకి గుడ్‌బై చెప్పారు. బీజేపీ నాయకత్వం తీరుపై వీళ్లంతా ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణలో బీజేపీ వలసలను ప్రోత్సహించింది. వివిధ పార్టీలకు చెందిన నేతలను అక్కున చేర్చుకొని వారికి పదవులు కట్టబెట్టింది.
గన్ మెన్ కూడా లేకుండా ఒంటరిగా..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో వివేక్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు రేవంత్ రెడ్డి. గన్ మెన్ కూడా లేకుండా ఒంటరిగా వెళ్లిన రేవంత్ రెడ్డి.. దాదాపు గంటన్నరసేపు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వివేక్‌ను కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా రేవంత్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేసిన వివేక్.. కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లుగా తెలుస్తోంది.