విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం (YCP Government) పై మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (Former MLA Vishnukumar raju) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… ఈ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వమన్నారు. నిరహార దీక్ష సంవత్సరం చేసినా పట్టించుకునే ప్రభుత్వం కాదని మండిపడ్డారు. అమరావతి రైతులు (Amaravati farmers) ఎన్ని దీక్షలు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ వైసీపీ ప్రభుత్వమని… ఎన్నుకున్న ప్రజలకు బాగా బుద్ధి వచ్చిందని అన్నారు. 2024లో వైసీపీ బయటకు పోవడంఖాయమని జోస్యం చెప్పారు. ఎస్సీ, ఎస్సీ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఆదాని మీద జగన్ (AP CM Jaganmohan Reddy) కు ఎందుకంత ప్రేమో అర్థం కావడం లేదన్నారు. పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఆదానికి మరో ఆరవై ఎకరాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టును జగన్ (AP CM) దోచిపెట్టారని… జగన్ భారీగా దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘జగన్ గారు మీరు ప్రజల్లో చులకనైపోయారు’’ అంటూ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!