విశాఖలో సముద్రతీరాన్ని క్లీన్ చేయడం కోసం ఇప్పటివరకు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సేకరించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సముద్రతీరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని అన్నారు. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏయూ కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ విశాఖలో పార్లె ఫర్ ది ఓషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. తీరంలో వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఆ సంస్థ పనిచేస్తోందన్నారు. ఈ ఒప్పందంతో దాదాపు 16 వేల కోట్ల పెట్టుబడులు రాబోయే ఆరేళ్లలో వస్తాయని వివరించారు. ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని ఈ సందర్భంగా జగన్ ప్రకటించారు. తమ ప్రధాన లక్ష్యం సుస్ధిరాభివృద్ది అని, పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలని, క్లాప్ పధకం కింద 4,097 చెత్త సేకరణ వాహనాలు ఇచ్చామని చెప్పారు. మెరైన్ ప్లాంట్ల వల్లే 70 శాతం ఆక్సిజన్ లభిస్తోందన్నారు. ప్లాస్టిక్ డెబ్రస్ వల్ల సముద్ర జలచరాలు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. ఏపీ 975 కివిూ కోస్తా తీరాన్ని కలిగివుందన్నారు. ప్లాస్టిక్ ఫ్రీ ఓషన్ సాధనే లక్ష్యమని, అందుకు రెండు ప్రముఖ సంస్ధలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. గ్లోబల్ ఎలైన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ సంస్ధ గ్రీన్ ట్రాన్సాఫార్మేషన్ కోసం పని చేస్తుందని.. ఐడియాస్ తీసుకువస్తారని సీఎం జగన్ అన్నారు. పార్లే సంస్ధ ప్లాస్టిక్ ఏరివేతతో పాటు రీసైకిలింగ్ కోసం పని చేస్తుందని, ఉత్పత్తులను తయారు చేసి ఎయర్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవాయడ్ ఇంటర్ సెప్ట్ రీ డిజైన్ స్టేషన్ తీసుకువస్తామన్నారు. పార్లే సంస్ధ 10 ఎకో ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తుందని, 20 వేల ఓషన్ వేరియర్స్‌ను తయారు చేస్తామన్నారు. ఒక్కో వారియర్‌కు నెల వారీ రూ. 16 వేల ఆదాయం లభిస్తుందన్నారు. పార్లే సూపర్ హబ్‌లో రీ సైక్లింగ్, అప్ సైక్లింగ్ పక్రియలు జరుగుతాయని చెప్పారు. పార్లే సూపర్ ఇనిస్టిట్యూట్ విశాఖలో రాబోతోందని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో పనిచేయడం గొప్ప విషయమన్నారు. 2027 కల్లా ప్లాస్టిక్ పొల్యూషన్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేస్తామన్నారు. పార్లే ఫర్ ది ఓషన్ సంస్ధ నుంచి రూ. 16వేల కోట్ల పెట్టుబడులు విశాఖకు వస్తాయన్నారు. ఇందులో బాగంగా ఏపిలో ప్లాస్టిక్ ఫెక్సీలు బ్యాన్ చేస్తున్నామన్నారు. తిరుమలో ఇప్పటికే ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అమలవుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!